అరె.. ఇప్పుడు ఒక్కటీ ముదురు బెండకాయ ఉండటం లేదు.. ఇదీ రీజన్..

నేటి మార్కెట్‌లో లభించే బెండకాయలు గతంలోలా ముదరగా ఉండటం లేదు. రెండు కిలోలు కొన్నా అన్నీ లేతగానే కనిపిస్తాయి. అయితే అందుకోసం ఒక రకమైన స్ప్రే వినియోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . కోసే ముందు చేసే ఈ స్ప్రే బెండకాయలను లేతగా చేస్తుంది. ఈ పద్ధతి వల్ల మనం తినే బెండకాయల ద్వారా రసాయన పదార్థాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

అరె.. ఇప్పుడు ఒక్కటీ ముదురు బెండకాయ ఉండటం లేదు.. ఇదీ రీజన్..
Okra

Updated on: Mar 11, 2026 | 7:51 AM

నేటి మార్కెట్‌లో లభించే బెండకాయల గురించి ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో, పావు కేజీ బెండకాయలు కొన్నా అందులో నాలుగు ఐదు ముదురు బెండకాయలు ఉండేవి. అవి చేత్తో విరిచి చూస్తే సులభంగా విరిగేవి కావు. కానీ ఇప్పుడు మనం రెండు కిలోల బెండకాయలు కొన్నా, అందులో ఒక్కటి కూడా ముదరగా ఉండదు. అన్నీ లేతగా, తాజాగా కనిపిస్తాయి. ఎంత లావు ఉన్నా సరే, అన్నీ సులభంగా విరిగిపోతాయి. ఈ బెండకాయల లేతదనానికి కారణం వాటికి చేసే ఒక ప్రత్యేకమైన స్ప్రే. పంట కోసే ముందు ఈ స్ప్రేను ఉపయోగిస్తారు. స్ప్రే చేయక ముందు సులభంగా విరగని బెండకాయలు, స్ప్రే చేసిన తర్వాత లేతగా మారి వెంటనే విరిగిపోతాయి.

ఈ ప్రక్రియ ఒక నిర్దిష్ట సమయపాలనలో జరుగుతుంది. ఉదయం స్ప్రే చేస్తే, మరుసటి ఉదయం వాటిని కోసి, అదే రోజు సాయంత్రం హోల్‌సేల్‌ మార్కెట్‌కు పంపిస్తారు. ఆ తర్వాత రోజు ఉదయం అవి రిటైల్‌ దుకాణాలకు చేరుకుంటాయి. ఈ పద్ధతి వల్ల బెండకాయలు చూడటానికి తాజాగా, లేతగా కనిపించినప్పటికీ, వాటిలోకి చేరిన రసాయన పదార్థాలు మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బెండకాయలు కొనేటప్పుడు, తినేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం అవసరం.

Also Read: మీరు కోళ్ల ఫారం పెట్టాలనుకుంటే రూ.50 లక్షల రుణం.. అందులో 50 శాతం రాయితీ

Follow Us