Oil Test: మీ ఇంట్లో ఉండే వంటనూనె కల్తీదా..? మంచిదా..? చిన్న ప్రయోగంతో తెలుసుకోండి

| Edited By: Ravi Kiran

Apr 05, 2022 | 6:39 AM

Oil Test: మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల నియంత్రణపై కేంద్రం చేపట్టిన చర్యల వల్ల తగ్గుముఖం..

Oil Test: మీ ఇంట్లో ఉండే వంటనూనె కల్తీదా..? మంచిదా..? చిన్న ప్రయోగంతో తెలుసుకోండి
Follow us on

Oil Test: మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల నియంత్రణపై కేంద్రం చేపట్టిన చర్యల వల్ల తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల నేపథ్యంలో వంట నూనె ధరలు (Cooking Oil Prices) ఒక్కసారిగా అకాశాన్నంటాయి. ధర ఎంత ఉన్నా.. కొనడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే నూనె లేనిదే వంటలు చేయలేము. ఒక వైపు ధరలు మండిపోతుంటే.. మరో వైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే అవసరాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు కల్తీ నూనెలు తయారు చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది. కల్తీకి ఎంత చెక్‌ పెట్టినా.. ఏదో విధంగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఆహార కల్తీ వల్ల మనకు తెలియకుండానే పలు రోగాలు దరి చేరుతున్నాయి. ఇలాంటి కల్తీ నూనె వల్ల ఎన్నో రోగాలు చుట్టుముట్టి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నూనె కల్తీ ఉందా..? లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. మన ఇంట్లోనే చిన్నపాటి ట్రిక్‌ వల్ల వంటల్లో నూనె కల్తీదా..? మంచిదా..? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా) ఓ వీడియోను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

 


ప్రధానంగా వంటనూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. ఇది వాడడం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం తదితర రోగాలకు దారితీస్తుంది. అయితే మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో అనేది ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చంటుంది ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా( ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ).

కల్తీ నూనెను ఎలా గుర్తించాలంటే..

మీరు వాడే నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉంది అంటే అది కల్తీని అర్థం. నూనెలో అది ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా రెండు మి.లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలో వేయాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే పాత్రలోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైనదిగా గుర్తించాలి. అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం. అదే నూనె రంగు మారి ఎరుపు రంగు మారితే అది కల్తీ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

 

ఇవి కూడా చదవండి:

Fish Benefits: మీరు చేపలను తరచూగా తింటున్నారా..? అద్భుతమైన ఫలితాలు ఇవే..!

Healthy Kidneys: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా..?