ఊబకాయం అనేది దీర్ఘకాలిక వ్యాధి.. దీనిలో అధిక కొవ్వు శరీరంలో పేరుకుపోవడంతోపాటు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా నిర్వచిస్తారు.. మీ BMI 30 కంటే ఎక్కువ ఉంటే, మీరు ఊబకాయంతో ఉన్నట్లే.. అయితే అది 25 కంటే ఎక్కువ ఉంటే మీరు అధిక బరువు వర్గంలోకి వస్తారు. అయితే.. స్థూలకాయం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వీటిలో ప్రధానంగా జన్యువులు, అతిగా తినడం, అధిక కొవ్వు పదార్ధాలు తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు అధికంగా పెరిగి.. ఊబకాయంగా మారుతుంది.. దీంతోపాటు.. థైరాయిడ్, కొన్ని రకాల మందులు వంటి వైద్య పరిస్థితులు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ దీని ప్రభావం మహిళలు, పురుషుల్లో.. ఇద్దరిలోనూ భిన్నంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, దానిని వదిలించుకోవడానికి, ఇద్దరికీ వేర్వేరు ఆహార ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి, ఆహారాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే ఇందులో చాలా మంది తప్పులు చేస్తుంటారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు స్త్రీలు, పురుషులకు వివిధ రకాల ఆహారాలు అవసరమని తాజా అధ్యయనంలో తేలింది.
NCBI నివేదిక ప్రకారం.. ఊబకాయం కలిగిన స్త్రీలు గుండె జబ్బులు, మధుమేహం, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అలాగే, దీని వల్ల మరణించే ప్రమాదం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో, ఊబకాయం ఉన్న పురుషులు దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
కంప్యూటర్స్ ఇన్ బయాలజీ అండ్ జర్నల్‌లోని కొత్త పేపర్ ప్రకారం.. బరువు తగ్గడానికి, పురుషులు అధిక పిండి (హై కార్బ్స్) పదార్థాలు కలిగి ఉండాలి.. మహిళలు అధిక కొవ్వు అల్పాహారం తీసుకోవాలి. అసలైన, మొదటి భోజనం అంటే అల్పాహారం.. బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కాబట్టి అది పరిపూర్ణంగా ఉండటం చాలా ముఖ్యం.
చాలా గంటలు ఉపవాసం ఉన్న తర్వాత పురుషులు, మహిళలు ఈ అధిక కార్బోహైడ్రేట్/అధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని తింటే వారు, సులభంగా బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే, అధిక ఫ్యాట్ ఆహారం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. డైట్ ఫాలో అయ్యే ముందు.. వారి బరువు, ఆరోగ్యం తదితర పరిణామాలను గమనించి.. ప్రణాళికలను రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..