Kitchen Hacks: మీ పళ్లు ఎంత పసుపుపచ్చగా ఉన్నా.. ఈ చిట్కాతో తెల్లగా అవ్వడం గ్యారెంటీ!!

|

Aug 16, 2023 | 1:20 PM

మన ఇంట్లో ఉండే వంటిల్లు.. ఔషధాల సమాహారం. చాలా అనారోగ్యాలకు పరిష్కారాలు మన వంటింట్లోనే ఉంటాయి. అవి తెలియక కొందరు, తెలిసి కూడా నేచురల్ వైద్యాని కంటే.. ఇంగ్లీష్ మందులే మింగలం మేలని భావించి.. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలకువేల రూపాయలు వదిలించుకుంటారు. కొన్ని ఈజీ టిప్స్ పాటించడం వల్ల.. ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తో చెక్ పెట్టవచ్చు. చాలా మంది దంతాలకు గార పట్టి.. పసుపు రంగులోకి మారిపోతాయి. దీంతో నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది..

Kitchen Hacks: మీ పళ్లు ఎంత పసుపుపచ్చగా ఉన్నా.. ఈ చిట్కాతో తెల్లగా అవ్వడం గ్యారెంటీ!!
Yellow Teeth
Follow us on

మన ఇంట్లో ఉండే వంటిల్లు.. ఔషధాల సమాహారం. చాలా అనారోగ్యాలకు పరిష్కారాలు మన వంటింట్లోనే ఉంటాయి. అవి తెలియక కొందరు, తెలిసి కూడా నేచురల్ వైద్యాని కంటే.. ఇంగ్లీష్ మందులే మింగలం మేలని భావించి.. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలకువేల రూపాయలు వదిలించుకుంటారు. కొన్ని ఈజీ టిప్స్ పాటించడం వల్ల.. ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తో చెక్ పెట్టవచ్చు. చాలా మంది దంతాలకు గార పట్టి.. పసుపు రంగులోకి మారిపోతాయి. దీంతో నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతూంటారు. వాటిని క్లీన్ చేయించుకునేందుకు క్లినిక్ కు వెళ్లాలంటే భయపడతారు. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలా అని మదన పడుతూంటారు. ఇక అలాంటి భయాలేం పెట్టుకోకండి. ఈ ఒక్క చిట్కాతో మీ దంతాలు తెల్లగా మెరవడం ఖాయం. కేవలం రెండే రెండు నిమిషాల్లో మీ దంతాలకు పట్టిన గార వదిలిపోతుంది.

దంతాలకు గారపట్టి.. అవి పసుపుపచ్చగా ఉండటం వల్ల నలుగురిలో నవ్వుతూ ఉండలేరు. సరిగ్గా మాట్లాడలేరు. నోరు దుర్వాసన కూడా వస్తుంటుంది. దీనిని వదిలించుకునేందుకు అనేక రకాల పేస్ట్ లు వాడి వాడి విసుగెత్తిపోయుంటారు కదా. ఇకపై అలాంటివేం ఉండవు. ఈ చిట్కా తయారు చేయడం చాలా సులభం. వాడటం ఇంకా సులభం. ఇంతకీ ఏంటి ఆ చిట్కా అని ఆలోచిస్తున్నారా ? ఈ చిట్కా కోసం పెద్దగా ఖర్ చుపెట్టనక్కర్లేదు. జస్ట్ అర చెక్క నిమ్మరసం, ఒక ఇంచు అల్లం తురుము, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్ మతొక్క తురుము ఉపయోగించాల్సి ఉంటుంది.

ముందుగా అల్లంపై పొట్టు తీసేసి తురిమి పెట్టుకోవాలి. అందులో అర చెక్క నిమ్మరసం పిండి, దాని తొక్కను కూడా తురిమి వేసుకోవాలి. అందులో ఉప్పువేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ తో అద్ది దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకున్న గార, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారుతాయి. చిగుళ్లు కూడా బలంగా, పటిష్టంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి