Zoonotic Langya: అమ్మ బాబోయ్‌.. మరో కొత్త వైరస్‌ వచ్చేసింది.. ఇప్పటికే 35 మందికి అటాక్‌..

Zoonotic Langya: యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఓవైపు మంకీ ఫాక్స్‌ ప్రపంచాన్ని దేశాలను ఇప్పటికే భయపెడుతోన్న తరుణంలో తాజాగా...

Zoonotic Langya: అమ్మ బాబోయ్‌.. మరో కొత్త వైరస్‌ వచ్చేసింది.. ఇప్పటికే 35 మందికి అటాక్‌..
Follow us

|

Updated on: Aug 09, 2022 | 2:59 PM

Zoonotic Langya: యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఓవైపు మంకీ ఫాక్స్‌ ప్రపంచాన్ని దేశాలను ఇప్పటికే భయపెడుతోన్న తరుణంలో తాజాగా మరో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. కరోనా మహమ్మార్ని పుట్టినిల్లు అయిన చైనాలోనే ఈ కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. తైవాన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ తెలిపిన వివరాల ప్రకారం చైనాలో జూనోటిక్‌ లాంగ్యా వైరస్‌ వెలుగులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన 35 మంది పడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త వైరస్‌ సంక్రమణను గుర్తించడానికి, పర్యవేక్షించడానికి తైవాన్‌ న్యూక్లియిక్‌ యాసిడ్‌ పరీక్ష పద్ధతిని ప్రారంభిస్తుందని అక్కడి మీడియో నివేదికలు చెబుతున్నాయి.

ఈ కొత్త వైరస్‌ను చైనాలోని షాన్‌డాంట్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో గుర్తించారు. ఈ వైరస్‌ మనుషులతో పాటు జంతువులకు కూడా సోకుతున్నట్లు గుర్తించారు. తైవాన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చువాంగ్‌ జెన్‌ హ్సియాంగ్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. వైరస్‌ ఎలా వ్యాపిస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు కాబట్టి వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలో మేకల్లో 2 శాతం, కుక్కలలో 5 శాతం కేసులు గుర్తించారు. ఈ కొత్త రకం వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం ఎలుకను పోలి ఉండే ఒక చిన్న క్షీరదం అని పరిశోధకులు భావిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు ఏంటి.?

ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఎక్కువగా జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించినట్లు వైద్యులు గుర్తించారు. వైరస్ బారిన పడిన 35 మందిలో 26 మందికి ఇవే లక్షణాలు కనిపించాయి. అంతేకాకుండా తెల్ల రక్త కణాల తగ్గుదుల కూడా గమనించారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో పాటు లివర్‌, కిడ్నీల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు రోగుల్లో గుర్తించారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..