
ప్రతి చిన్న నొప్పికీ పెయిన్ కిల్లర్స్ వాడటం సరికాదు. దీనివల్ల ఆరోగ్యంపై ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, పీరియడ్స్ నొప్పి వంటివి తరచూ వస్తుంటాయి. ఇలాంటి వాటికి కూడా మందులు వాడటం వల్ల శరీరం వాటికి అలవాటు పడుతుంది. కానీ ఇంట్లోనే దొరికే కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే పెయిన్ కిల్లర్ లక్షణాలు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.
ఈ పండులో ‘బ్రోమెలైన్’ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది వాపు, మంట, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగకరం. పంటి నొప్పి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైనాపిల్ జ్యూస్ తాగడం లేదా ముక్కలను తినడం మంచిది.
రుచిగా ఉండే ఈ పండ్లలో నొప్పిని తగ్గించే గుణాలు అధికం. ఇందులో ఉండే ఫైటో-న్యూట్రియంట్స్ నొప్పి, వాపును తగ్గిస్తాయి. ఒత్తిడికి గురైన కండరాలను కూడా ఇవి సడలించగలవు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల చికిత్సలో బ్లూబెర్రీలు సహాయపడతాయి.
వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పులకు అల్లం ఒక మంచి మందు. ఇది కండరాలను శాంతపరుస్తుంది. అంతేకాదు, పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పులను కూడా తగ్గిస్తుంది. అల్లంలో ఉండే ‘సాలిపిలేట్స్’ అనే సమ్మేళనం నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అల్లం టీ తయారుచేసి గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
పసుపును ప్రాచీనకాలం నుంచి ‘దేశీ మందు’గా ఉపయోగిస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు, శరీరంలో అంతర్గత నొప్పులు ఉన్నప్పుడు పసుపు పాలను తీసుకుంటారు. దీనిలో ఉండే ‘కర్కుమిన్’ అనే ప్రధాన సమ్మేళనం వాపు, మంటలను తగ్గిస్తుంది. ఇది క్రిమినాశక గుణాలు కలిగి ఉంటుంది.
దంతాలు, చిగుళ్ల వాపు, నొప్పులకు లవంగాలను నమలడం అమ్మమ్మల కాలం నుంచి ఉన్న చిట్కా. లవంగంలో ఉండే ‘యూజీనాల్’ అనే సమ్మేళనం సహజ మత్తుమందులా పనిచేస్తుంది. దీనివల్ల నొప్పి ఉన్న ప్రాంతం మొద్దుబారి నొప్పి తగ్గుతుంది.
చెర్రీ పండ్లలో ‘ఆంథోసైనిన్స్’ అనే క్రియాశీలక సమ్మేళనం నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు 20 నుంచి 25 చెర్రీలు తింటే తలనొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. వీటిని శుభ్రం చేసి అలాగే తినేయవచ్చు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు చికిత్స కోసం లేదా మందుల వాడకం గురించి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.