
మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డిటాక్స్ డ్రింక్ ప్రయత్నించండి. దీన్ని తాగితే కాలేయంలో పేరుకున్న కొవ్వు, వ్యర్థాలు తొలగిపోతాయి. ప్రస్తుతం చాలా మందికి ఉన్న ఫ్యాటీ లివర్ సమస్యకు ఇది ఒక మంచి పరిష్కారం. కాలేయ ఆరోగ్యానికి ఉసిరికాయ చాలా మేలు చేస్తుంది. ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవడానికి ముందుగా గింజలు తీసిన ఉసిరికాయ ముక్కలను మిక్సీలో వేయాలి. ఆ తర్వాత అలోవెరా జెల్, కొత్తిమీర, నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టుకుని చివరిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపితే మీ ఆరోగ్యకరమైన డ్రింక్ సిద్ధం.
ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక గంట ముందు లేదా భోజనం చేసిన ఒక గంట తర్వాత ఈ జ్యూస్‌ను తాగాలి.
ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకూడదు.
మంచి ఫలితం కోసం వరుసగా మూడు రోజుల పాటు తాగండి.
ఈ మూడు రోజులు మద్యం, సిగరెట్లు, నూనె పదార్థాలు తినకూడదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)