Kidneys Health-Natulal Tips: మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ కరెక్టుగా పనిచేస్తేనే మనిషి జీవితం సక్రమంగా నడుస్తుంది. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి కిడ్నీలు. మనం తినే ఆహారాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకడుతూ నిరంతరం పనిచేస్తూనే ఉండే కిడ్నీలకు సమస్యలు వస్తాయి. కిడ్నీలో రాళ్లు, సిస్టులు, కిడ్నీ పనిచేయకుండా పోవడం వంటి అనేక వ్యాధులు వస్తాయి. అందుకనే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పనిసరి.. రోజూ తగినంత నీటిని తాగడంతో పాట.. మనం రోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. ఈరోజు కిడ్నీలను డీటాక్సిఫై చేసి శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపే చిట్కాలను గురించి ఈరోజు తెలుసుకుందాం..
*ముల్లంగి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి అందరికీ తెలుసు.. అయితే ముల్లంగి ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ముఖ్యంగా కిడ్నీలను శుభ్రం చేస్తాయి. ముల్లంగి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అనంతరం ఈ ఆకుల రసాన్ని రోజూ తాగడం వలన శరీరంలోని వ్యర్ధాలు విసర్జించబడి మొత్తం శుభ్రపడుతుంది.
*మొక్క జొన్న పొత్తులు తెచ్చుకుని వాటి మీద ఉండే పీచుని వ్యర్థం అనుకుని పడేస్తుంటారు. అయితే ఈ మొక్కజొన్న పొట్టమీద ఉండే పీచులో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. ఈ మొక్కజొన్న కండి మీద ఉండే పీచు ( కార్న్ సిల్క్ ) ని అనేక వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు , మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ వాపు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ రక్తప్రసరణ లోపాలు, గుండె వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు, అలసట, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ నీటిని రోజూ తాగడం వలన కిడ్నీ పని తీరు మెరుగుపడుతుంది.
కార్న్ సిల్క్ వాటర్: మొక్కజొన్న పీచుని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసుకుని మరిగించాలి. బాగా మరిగిన నీటిలో నిమ్మరసం వేసుకుని.. వేడివేడిగా తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు తాగడం వలన శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి.