Liver Health: ఈ డ్రింక్స్ తాగితే లివర్‌ కు మస్తు రిలీఫ్ వస్తుంది..! సూపర్ గా పని చేస్తుంది..!

లివర్ శరీరంలో హానికర పదార్థాలను బయటకు పంపే ప్రధాన అవయవం. అయితే అది బాగా పనిచేయాలంటే కొన్ని సహజమైన డ్రింక్‌ లను రోజూ తీసుకోవడం అవసరం. ఇవి కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచే విధంగా సహాయపడతాయి. ఇప్పుడు అలాంటి ఉత్తమమైన డ్రింక్‌ ల గురించి తెలుసుకుందాం.

Liver Health: ఈ డ్రింక్స్ తాగితే లివర్‌ కు మస్తు రిలీఫ్ వస్తుంది..! సూపర్ గా పని చేస్తుంది..!
Healthy Liver

Updated on: Jun 01, 2025 | 9:39 PM

మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది శరీరంలో ఉన్న హానికరమైన విష పదార్థాలను బయటకు పంపించే క్రమంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జీవనశైలి, ఆహారం, కాలుష్యం వల్ల లివర్ సరిగా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఈ సహజ డ్రింక్ లను కొన్ని రోజులు ఉపయోగించి కాలేయాన్ని శుభ్రపరచుకోవచ్చు.

ప్రతి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం కలిపి తాగండి. ఇది కాలేయాన్ని శుభ్రపరిచే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే మీరు తేలికపాటు అనుభూతి పొందుతారు.

రోజూ తాజా బీట్రూట్ రసం తాగటం వల్ల లివర్ ఆరోగ్యంగా మారుతుంది. ఇందులో ఉన్న బెటలైన్స్ అనే రసాయనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ కాలేయ కణాలను నయం చేస్తాయి. కొత్త కణాల ఏర్పాటుకు తోడ్పడతాయి.

గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగితే.. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే కాలేయంపై ఉన్న ఒత్తిడిని తగ్గించి దాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజుకి రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం ద్వారా లివర్‌ లో ఉన్న కొవ్వును తగ్గించవచ్చు. దీనిలోని కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు పొడి, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగండి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం కాలేయాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఒక గ్లాసు నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఉదయం తాగడం వల్ల బైల్ ఉత్పత్తి పెరిగి లివర్ డిటాక్స్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.

క్యారెట్, బీట్రూట్, ఆకుకూరల మిశ్రమంతో చేసిన వెజిటబుల్ జ్యూస్ నిత్యం తాగడం వల్ల కాలేయానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి శరీరానికి డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి.

డాండెలియన్ రూట్.. ఈ చెట్టు వేరు నుంచి తయారయ్యే టీ బైల్ స్రవణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కాలేయంలోని విషపదార్థాలను తొలగించడంలో కీలకంగా పని చేస్తుంది. రోజుకి 2-3 కప్పులు తాగవచ్చు.

క్రాన్బెర్రీలలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని రిపేర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక గ్లాసులో 75 శాతం నీరు, 25 శాతం క్రాన్బెర్రీ రసం కలిపి తాగడం ఉత్తమం.

మిల్క్ థిస్టిల్ అనే మూలిక టీ రూపంలో తీసుకుంటే కాలేయ కణాలను రక్షించడమే కాకుండా.. అవి తిరిగి పునరుత్పత్తి కావడాన్ని ప్రోత్సహిస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగవచ్చు.

ఈ డ్రింక్ లు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే ఏవైనా తీవ్రమైన లివర్ సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)