Boiled Egg: గుడ్డుతో అనేక రకాల ప్రయోజనాలు.. కానీ వాటిని ఉడికించి తింటే కలిగే లాభాల గురించి మీకు తెలుసా..?

|

Dec 06, 2022 | 5:16 PM

చాలా మంది డాక్టర్లు ప్రతి రోజు కనీసం ఒక గుడ్డు అయినా తినాలిని సూచిస్తారు. అయితే స్వతహాగనే గుడ్డు తినడానికి ఇష్టపడేవారికి ప్రత్యేకంగా ఏదైనా సీజన్ అంటూ ఉందా..? అలా..

Boiled Egg: గుడ్డుతో అనేక రకాల ప్రయోజనాలు.. కానీ వాటిని ఉడికించి తింటే కలిగే లాభాల గురించి మీకు తెలుసా..?
వారి ప్రకారం కొన్ని రకాల వ్యాధులలో బాధపడేవారు గుడ్లు తినడం చాలా హానికరం. చాలా మంది ప్రజలు చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు తింటారు. కొన్నిసార్లు వాటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి శరీరానికి హాని కలిగిస్తుంది. అంతకాక అనేక వ్యాధులు పెరిగే ప్రమాదం కూడా తలెత్తుతుంది.
Follow us on

చాలా మంది డాక్టర్లు ప్రతి రోజు కనీసం ఒక గుడ్డు అయినా తినాలిని సూచిస్తారు. అయితే స్వతహాగనే గుడ్డు తినడానికి ఇష్టపడేవారికి ప్రత్యేకంగా ఏదైనా సీజన్ అంటూ ఉందా..? అలా ఏం లేదు. శీతాకాలం, వేసవి, వర్షాకాలంలో కూడా గుడ్డును నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే చలికాలంలో ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఊహించనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ముందుగా దానిని కాపాడుకోవడం చాలా అవసరం. అలా కాపాడుకోవాలని అనుకునేవారు తప్పక గుడ్లను తినవచ్చు. శరీరంలోని అనేక పోషకాల అవసరాన్ని తీర్చే అనేక గుణాలు గుడ్లలో ఉన్నాయి.

ఇంకా ఉడికించిన గుడ్డు మన శరీరాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సరైన రీతిలో ఉంచుతుంది. అందుకే చాలా మంది గుడ్లను అల్పాహారంగా తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో ప్రజలు అనేక రకాలుగా గుడ్లను తింటారు. కానీ ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది: చలికాలంలో ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ప్రొటీన్లు, క్యాల్షియం ఉన్న ఆహారం కావాల. అలాంటి పరిస్థితుల్లో రోజూ గుడ్లు తింటే శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. తద్వారా మీకు చలి వేయదు. ఇంకా చలికాలం ప్రభావం మీ మీద ఉండదు. ఇందు కోసం ప్రతిరోజూ కనీసం ఒక ఉడికించిన గుడ్డు తినండి. ఉడికించిన గుడ్లను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలలో రోగనిరోధక శక్తి బలపడడం కూడా ఒకటి.

ఇవి కూడా చదవండి

ఐరన్ లోపం తొలగిపోతుంది: గుడ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో గుడ్లను తినడం వల్ల శరీర అలసట కూడా తగ్గుతుంది. మీరు మైకంతో బాధపడుతుంటే గుడ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదే సమయంలో, శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగించడానికి గుడ్లు కూడా తినవచ్చు.

మీ మనస్సును చురుకుగా ఉంచుతుంది: గుడ్లలోని కొవ్వు ఆమ్లాలు మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫలితంగా మీ మనసు, ఇంకా శరీరం మరింత చురుకుగా పనిచేస్తాయి.