Milk Adulteration: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా?.. ఈ సింపుల్ టిప్స్‌తో పాల కల్తీని తేల్చేయండి..

|

Oct 10, 2021 | 8:41 PM

Milk Adulteration: ఒక వ్యక్తి రోజు మొదలయ్యేది టీ లేదా పాల తోనే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే, టీ చేయాలన్నా పాలు కావాల్సిందే. పాలను సంపూర్ణ ఆహార పదార్థాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

Milk Adulteration: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా?.. ఈ సింపుల్ టిప్స్‌తో పాల కల్తీని తేల్చేయండి..
Milk
Follow us on

Milk Adulteration: ఒక వ్యక్తి రోజు మొదలయ్యేది టీ లేదా పాల తోనే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే, టీ చేయాలన్నా పాలు కావాల్సిందే. పాలను సంపూర్ణ ఆహార పదార్థాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అందుకే ప్రతీ రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. పాలలో అనేక విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్, నియాసిన్, భాస్వరం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో ప్రతీది కల్తీమయం అవుతోంది. తినే తిండి సహా అన్నీ కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా పాల విషయానికి వస్తే మరీ దారుణం అని చెప్పాలి. పాల కల్తీకి సంబంధించి మనం తరచుగా వార్తలు చూస్తూనే ఉంటారు. పాలను అనేక రకాలుగా కల్తీ చేస్తున్నారు. కొందరు నీళ్లు కలిపి కల్తీ చేస్తే.. మరికొందరు ఏకంగా కెమికల్స్‌తో పాలనే తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో పాల కొరతను ఛాన్స్‌గా తీసుకుంటున్న కేటుగాళ్లు.. సింథటిక్ పాలను అమ్ముతున్నారు. ఇలాంటి పాలు తాగిన జనాలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే, పాలలో తేడా తెలుసుకోలేక ప్రజలు కూడా ఆ కల్తీ పాలనే తాగేస్తున్నారు. అందుకే కల్తీ పాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నీటి ద్వారా కల్తీ అయిన పాలను ఇలా గుర్తించండి..
పాలల్లో నీటిని కలపడం అనే సాధారణ పద్ధతి. అయితే, పాలలో నీళ్లు ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడానికి ఒక చుక్క పాలను నేలపై వేయండి. అవి నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలు అయితే.. భూమిలోకి త్వరగా ఇంకవు. నీళ్లు కలిపిన పాలు అయితే.. వెంటనే భూమిలోకి ఇంకిపోతాయి.

పిండి కలిపిన పాలను ఇలా గుర్తించండి..
లోడినియా రసాయన ద్రావణంలో ఒక చుక్క పాలు వేయండి. అది నీలం రంగులోకి మారితే.. ఆ పాలలో పిండితో చేసినట్లే భావించాలి.

యూరియాతో చేసిన పాలను ఇలా గుర్తించండి..
టెస్ట్ ట్యూబ్‌లో ఒక చెంచా పాలను తీసుకుని ఆ పాలలో అర టీస్పూన్ టోర్ పప్పు, సోయాబీన్ పొడిని కలపండి. ఐదు నిమిషాల తరువాత ఎర్ర రంగులో ఉన్న లిట్మస్ కాగితాన్ని ఆ మిశ్రంలో ఉంచండి. కాగితం నీలం రంగులోకి మారినట్లయితే.. ఆ పాలలో యూరియా కలిపారని అర్థం.

డిజర్టెజ్ ఫౌడర్ ద్వారా చేసిన పాలను ఇలా కనిపెట్టండి..
ఐదు నుండి పది మిల్లీలీటర్ల పాలను తీసుకుని.. అదే మొత్తంలో నీటిని కలిపండి. ఆ మిశ్రమాన్ని బాగా షేక్ చేయండి. ఈ మిశ్రమంలో నురుగు కనిపిస్తే పాలలో వాషింగ్ పౌడర్, డిటర్జెంట్ ఫౌడర్ వేశారని అర్థం.

సింథటిక్ పాలను ఇలా పసిగట్టండి..
పాలు సహజంగా కొంచె చప్పగా, తీపిగా ఉంటాయి. కానీ సింథటిక్ పాలు మాత్రం చేదుగా ఉంటాయి. అలాగే, మీరు మీ వేలికి సింథటిక్ పాలలో ముంచి తీసి.. వాసన చూసినట్లయితే సబ్బు వాసన వస్తుంది. వేడి చేస్తే ఆ పాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇక దుకాణాల్లో లభించే యూరిస్ స్ట్రిప్ సహాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందా? లేదా? అని కూడా చెక్ చేయొచ్చు. ఈ స్ట్రిప్‌తో వచ్చే కలర్ లిస్ట్ పాలు కల్తీ చేయబడ్డాయా? లేదా? అని తెలుపుతుంది.

Also read:

PPF: నెలనెలా రూ. 1000 పెట్టుబడి పెట్టండి.. రూ.12 లక్షలు సంపాదించండి.. అది ఎలాగంటే..

Punjab CM’s son’s Marriage: లీడర్ల కళ్లు తెరిపించేలా పంజాబ్‌ సీఎం కుమారుడి వివాహం. చాలా సింపుల్‌గా, ఆర్భాటం లేకుండా వేడుక

Hair Fall Tips: మీ జుట్టు బాగా ఊడిపోతుందా?.. అయితే ఈ టిప్స్ పాటించండి.. జట్టును వత్తుగా చేసుకోండి..!