Healthy Breakfast: కొర్రలతో ఇడ్లీ.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఇలా తయారు చేసుకోండి!!

|

Aug 12, 2023 | 9:11 PM

ఇప్పుడున్న కాలంలో ప్రస్తుతం జనం ఎక్కువగా హెల్దీ ఫుడ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు వైద్యులు కూడా అనారోగ్య సమస్యలకు వైట్ రైస్ మానేసి.. బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలు తినాలని సూచిస్తున్నారు. అన్నానికి బదులు చిరుధాన్యాలు వండుకుని తింటే.. బరువు ఈజీగా తగ్గడంతో పాటు.. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ చిరుధాన్యాలతో చాలా హెల్దీ..

Healthy Breakfast: కొర్రలతో ఇడ్లీ.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఇలా తయారు చేసుకోండి!!
Korrala Idly
Follow us on

ఇప్పుడున్న కాలంలో ప్రస్తుతం జనం ఎక్కువగా హెల్దీ ఫుడ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు వైద్యులు కూడా అనారోగ్య సమస్యలకు వైట్ రైస్ మానేసి.. బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలు తినాలని సూచిస్తున్నారు. అన్నానికి బదులు చిరుధాన్యాలు వండుకుని తింటే.. బరువు ఈజీగా తగ్గడంతో పాటు.. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ చిరుధాన్యాలతో చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. మాంసాహారం కంటే రిచ్ ప్రోటీన్స్, ఫైబర్ వీటిల్లో దొరుకుతాయి. చిరు ధాన్యాల్లో కొర్రలు కూడా ఒకరకం. అయితే వీటిని అన్నం బదులు వండుకుని తినడమే కాకుండా.. బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీల్లా కూడా చేసుకుని తినొచ్చు. కొర్రలతో రుచిగా.. రోజూ చేసుకునే ఇడ్లీల్లా మెత్తగా ఉండే ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్రల ఇడ్లీలతో తయారీ విధానం:

ఒక గిన్నెలో 2 గ్లాసుల మినపప్పు, అర టీ గ్లాస్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి 6 గంటలపాటు నానబెట్టాలి. అలాగే మరో గిన్నెలో 2 గ్లాసుల కొర్రలు వేసి కడిగి 6 గంటలపాటు నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో అటుకులు వేసి 5 నిమిషాలు నానబెట్టాలి. ఆరు గంటల తర్వాత ఒక జార్ లో మినపప్పు, అటుకులు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

నానబెట్టి ఉంచుకున్న కొర్రల్ని మిక్సీ జార్ లో వేసుకుని రవ్వలాగా బరకగా ఉండేలా పిండి పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మినపపిండిలో కలిపి.. ఒకరాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పువేసి కలుపుకుని.. ఇడ్లీ ప్లేట్లలో వేసి.. 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడివేడిగా టేస్టీ కొర్రల ఇడ్లీ రెడీ అవుతాయి. వీటిలోకి చట్నీ, సాంబార్ కలుపుకుని తింటే.. ఆహా ! చాలా బాగుంటాయ్. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కొర్రల ఇడ్లీ తయారు చేసుకోండి. హెల్దీగా ఉండండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి