Liver Health Care: లివర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..

Liver Health Tips: శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది మనం ఆరోగ్యంగా ఉండటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే.. శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది.

Liver Health Care: లివర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..
Liver

Edited By: Ravi Kiran

Updated on: Feb 08, 2022 | 7:30 AM

Liver Health Tips: శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది మనం ఆరోగ్యంగా ఉండటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే.. శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచడానికి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీనితో పాటు ఇది శరీరానికి ఇన్ఫెక్షన్‌తో పోరాడే శక్తిని ఇస్తుంది. కాలేయం (liver health tips) మొత్తం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. జీర్ణక్రియ (digestion) లో తరచుగా సమస్యలు ఉంటే, అది బలహీనమైన కాలేయానికి సంకేతంగా పరిగణిస్తారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కాలేయం బలహీనపడటం ప్రారంభమవుతుందని.. దీంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. లివర్ సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా మద్యం, ఫ్రైలు, శుద్ధి చేసిన ఆహారం, తిపి పదార్థాలకు దూరంగా ఉండాలి.

వాస్తవానికి ఈ రోజుల్లో ప్రజలు పోషకాహారానికి బదులుగా ఫాస్ట్ ఫుడ్‌ను ఎక్కువగా తిసుకుంటున్నారు. ఈ ఆహారాలు కాలేయానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా హాని చేస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు పలు హోం రెమెడీస్ పాటిస్తే మేలు. అలాంటి కొన్ని హోం రెమెడీస్ (Liver Diet) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆహారం

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్ ఫుడ్ ముట్టుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. అధిక కేలరీల ఆహారం, అదనపు కొవ్వు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అధిక చక్కెర వినియోగం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. వీటికి బదులుగా సమతుల్య ఆహారం, రొటీన్‌ ఫుడ్‌ను అనుసరించడం ఉత్తమం. మీరు తక్కువ కేలరీలు ఉండే ఫైబర్ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

పరిశుభ్రత

మీరు ఆహారం తినేటప్పుడు లేదా వండేటప్పుడు పరిశుభ్రత పాటించాలి. తినే పదార్థాలు పరిశుభ్రంగా ఉండే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల కాలేయం ఆరోగ్యవంతంగా ఉండటంతోపాటు.. పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు. పరిశుభ్రత పాటించకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది.

వ్యాయామం

ఏదైనా వ్యాధిని నివారించడానికి లేదా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు వ్యాయమం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బలహీనమైన కాలేయం ఉన్న రోగులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని కూడా సలహా ఇస్తారు. షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరిగిన వారు కూడా ఈ వ్యాయామ దినచర్యను అనుసరించడం ద్వారా దానిని తగ్గించుకోవచ్చు. అయితే, వ్యాయామం చేయలేని వారు కనీసం నడవడం అయినా అలవర్చుకోవాలి.

ఉసిరి..

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్యాంక్రియాస్ పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది. ఒక కప్పు నీటిలో లేదా కషయంలో ఒక టీస్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి కొన్ని రోజుల పాటు తాగితే లివర్ సమస్యలు దూరమవుతాయి.

Also Read:

Health care: మనం తిన్న తర్వాత నోట్లో వేసుకునే వక్కతో ఎన్ని లాభాలో తెలుసా..

Diabetes: అకస్మాత్తుగా శరీరంలో చక్కర స్థాయిలు పెరిగిపోతే చాలా ప్రమాదం.. ఈ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలంటే..