Lemon Leaves: నిమ్మ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..నులిపురుగుల నుంచి ఉపశమనం కోసం..ఇలా తీసుకోండి

|

Mar 09, 2022 | 9:59 AM

Lemon Leaves: కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ప్రతి ఒక్కరి ఇంట్లో పెరడు.. దానిలో పువ్వులు, పండ్లు, నీడ నిచ్చే చెట్లు పెంచేవారు. జామ(Guava), మామిడి(mamidi), అరటి(Banana), నిమ్మ వంటి చెట్లు ఇంట్లోనే..

Lemon Leaves: నిమ్మ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..నులిపురుగుల నుంచి ఉపశమనం కోసం..ఇలా తీసుకోండి
Lemon Leaves Benefits
Follow us on

Lemon Leaves: కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ప్రతి ఒక్కరి ఇంట్లో పెరడు.. దానిలో పువ్వులు, పండ్లు, నీడ నిచ్చే చెట్లు పెంచేవారు. జామ(Guava), మామిడి(mamidi), అరటి(Banana), నిమ్మ వంటి చెట్లు ఇంట్లోనే ఉండేవి. మారుతున్న కాలంతో పాటు.. ఇళ్లలో ఇంటి స్థలాల్లో మార్పులు వచ్చాయి. దీంతో పెరడులో చెట్ల పెంపకం అన్న మాటనే ఇప్పుడు వినిపించడం లేదు. అయితే ఏడాది పొడవునా కాయలనిచ్చే నిమ్మ చెట్టు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మ కాయలు మాత్రమే కాదు.. ఆకులూ కూడా అనేక లాభాలను ఇస్తుంది.  నిమ్మ కాయల్లో విటామిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాదు.. శరీరంలోని ఎముకలుకూడా  గట్టిపడతాయి. లాభాలు తెలిస్తే మాత్రం.. ఉన్న కాసంత స్థలంలోనా లేదా టెర్రస్ పైనో ఈ మొక్కలను కచ్చితంగా పెంచేస్తారు. చిన్న చిన్న తెల్లని పూలు, నిగనిగలాడే ఆకులతో ఉండే నిమ్మ చెట్టు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తుంది.  నిమ్మ చెట్టు పరిమళ భరితమైన సువాసనలను వెదజల్లుతుంది. అయితే ఈరోజు నిమ్మ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  1. తరచుగా తలనొప్పితో ఇబ్బంది పడేవారు నిమ్మ ఆకులతో టీ చేసుకొని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది.
  2. వాంతులు, వికారం వంటి సమస్యలనుంచి నివారణకు నిమ్మ ఆకులు ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులు వాసన చూడటం వల్లన వాంతులు, వికారం తగ్గుతుంది.
  3. నిద్రలేమి, డిప్రెషన్ వంటి వాటికి కూడా నిమ్మ ఆకులు మంచి మెడిసిన్ గా పనిచేస్తాయి.
  4. శ్వాస కోశ, దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి  వ్యాధుల నుంచి నిమ్మ ఆకులు మంచి ఉపశమనం ఇస్తాయి. ఒక గ్లాసు నీటిలో ఐదారు నిమ్మ ఆకులను వేసి మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
  5.  కడుపు లో నులి పురుగులు ఉన్నప్పుడు స్పూన్ నిమ్మ ఆకుల రసంలో తేనె కలిపి ఐదు నుంచి పది రోజుల పాటు తాగడం వల్ల  నులి పురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  6. అధిక బరువు ఉన్నవారు సన్నబడాలని అనుకుంటే.. నిమ్మ ఆకుల రసంలో తేనే కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

 

Note: (అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి)

Also Read :

దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సింది లేదన్న వైరాలజిస్ట్