యాపిల్స్… రోజూ ఒకటి తింటే డాక్టర్ అవసరం రాదు అంటారు.. ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలు తగ్గించమే కాకుండా బలాన్ని ఇస్తుంది.. అయితే రోజులో ఒకటి కంటే ఎక్కువ యాపిల్స్ తినేవారు కూడా ఉన్నారు.. శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో యాపిల్స్ తినేవారి సంఖ్య ఎక్కువైంది. అయితే యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మరింత హానీ కలిగిస్తుంది. అవెంటే తెలుసుకుందాం..
1. యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరిగే సమస్య కూడా రావచ్చు. యాపిల్స్ లో పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి… ఎక్కువగా యాపిల్స్ తింటే శరీరంలో కొవ్వు కరగదు, బరువు పెరుగుతుంది.
2. యాపిల్స్ ఎక్కువగా తినడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. కడుపులో అధికంగా ఉండటం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.
3. యాపిల్స్ రోజులో ఎక్కువగా తింటే.. రక్తంలో చక్కెర స్థాయిని మరింత తగ్గించే అవకాశం కూడా ఉంది.
4. యాపిల్స్ ఎక్కువగా తింటే దంతాలు దెబ్బతింటాయి.. ఇందులో ఉండే ఆమ్లం వలన దంత సమస్యలు కలుగుతాయి.
5. రోజులో ఒక యాపిల్ మాత్రమే తినాలి.. రోజులో.. రెండు కూడా తినవచ్చు… అంతేకంటే ఎక్కువ తీసుకోవడం వలన హాని కలుగుతుంది.
Also Read: