Ranapala Plant 1
భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ప్రతి మొక్కకు ఓ ప్రత్యేక వైద్య గుణం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమైనప్పటికీ మనం పెద్దగా పట్టించుకోము. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరుబయట మొక్కలను పెంచడానికి ఇష్టపడుతుంటారు. అలా పెంచే మొక్కల్లో ఔషధ గుణాలుంటే.. మీరు విన్నది నిజమే మనం అందం కోసం ఆరుబయట పెంచే మొక్కలోనే అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయి. అదే రణపాల మొక్క. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం పినటం. ఈ మొక్కను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో అనేక అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి.
రణపాల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- రణపాల మొక్కల ఆకులు, కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
- రణపాల మొక్కల ఆకులు మందంగా ఉంటాయి. వీటిని తింటే వగరుగా, పులుపుగా అనిపిస్తుంది. వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా తినలేని వారు పావు లీటర్ నీళ్లల్లో నాలుగు రణపాల మొక్కల ఆకులను వేసి కాచుకుని కషాయంలా చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలుంటాయి.
- నడుము నొప్పి, తలపోటుతో బాధపడేవారు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుుకుని లేపనంలా రాసుకుంటే మంచిది.
- మొలల సమస్య ఉన్న వారు ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి తింటే అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు.
- రణపాల మొక్కల ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులోని అల్సర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం.
- ఈ ఆకుల రసాన్ని ఉదయం, సాయంత్రం రెండు టీ స్పూన్లు సేవించడం వల్ల కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.
- శరీరంపైన వాపులు, దెబ్బలు ఉన్న చోట ఈ మొక్క ఆకుల పేస్ట్ గుడ్డలో పెట్టి కట్టుకట్టడం వల్ల ఆయా సమస్య నుంచి బయటపడవచ్చు.
- చెవిపోటు సమస్య ఉన్న ఈ ఆకుల రసాన్ని రోజు నేరుగా చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
- ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజు 40 నుంచి 50 ఎంఎల్ సేవిస్తే స్త్రీలు యోని సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు.
- ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేపనంగా రాసుకుంటే కంటి సమస్యలను దూరం పెట్టవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..