Kiwi Juice Benefits: ఆరోగ్యమే మహాభాగ్యం..! రోజూ ఒక్క గ్లాస్ కివీ జ్యూస్‌ తాగితే ఇన్ని ప్రయోజనాలా..

|

Oct 11, 2022 | 9:38 PM

కివీ పండులో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. సాధారణ లేదా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ముందుగా కివీ పండు లేదా జ్యూస్ తాగడం ప్రారంభిస్తారు.

Kiwi Juice Benefits: ఆరోగ్యమే మహాభాగ్యం..! రోజూ ఒక్క గ్లాస్ కివీ జ్యూస్‌ తాగితే ఇన్ని ప్రయోజనాలా..
Kiwi Benefits
Follow us on

కివీ పండులో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. సాధారణ లేదా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ముందుగా కివీ పండు లేదా జ్యూస్ తాగడం ప్రారంభిస్తారు. ఎందుకంటే దీని వినియోగం వల్ల మన రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య వెంటనే పెరుగుతుంది. అయితే కివీ జ్యూస్ మీకు ప్లేట్‌లెట్స్ పెంచడంలో సహాయపడటమే కాకుండా, అనేక ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కివీ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బోలెడన్ని పోషకాలు..

రోజూ కివీ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. ఇది కాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను మీ నుంచి దూరంగా ఉంచుతుంది.

కివి జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: రోజూ కివీ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం హృదయ సంబంధ వ్యాధులకు చాలా ఆరోగ్యకరమైనది. మీరు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజూ 1 గ్లాసు కివీ జ్యూస్ తాగండి.
  2. చర్మం – జుట్టు సమస్యలు దూరం: కివీ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఇది విటమిన్ సి కి మంచి మూలం. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు కూడా మీ చర్మాన్ని తాజాగా, యవ్వనంగా మార్చుకోవాలనుకుంటే ప్రతిరోజూ కివీ జ్యూస్ తాగండి.
  3. జీర్ణక్రియకు ప్రయోజనకరం: విటమిన్ సి పుష్కలంగా ఉన్న కివి మీ జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ శరీరానికి ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  4. కణాలను సురక్షితంగా ఉంచుతుంది: దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో కివీ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది కాకుండా కివీ జ్యూస్‌లో ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్లు కనిపిస్తాయి. ఇది డి కణాలను రక్షించడంలో మీకు సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..