Mysterious Activity in brain: చనిపోయే ముందు మెదడు ఇలా స్పందిస్తుందా? చివరి క్షణాల్లో ఏం కనిపిస్తుందో తెలిస్తే షాకవుతారు..

ముఖ్యంగా పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నారు. మెదడులోని రహస్యాలను ఛేదించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూరో సైంటిస్టులు నిమగ్నమై ఉన్నారు. పరిశోధకుల బృందం ఇప్పుడు చనిపోయే అంచున ఉన్న ఇద్దరు వ్యక్తుల మెదడుల్లో కార్యకలాపాల్లో రహస్యమైన పెరుగుదలను గుర్తించింది. పరిశోధకులు చాలా కాలంగా మెదడు విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Mysterious Activity in brain: చనిపోయే ముందు మెదడు ఇలా స్పందిస్తుందా? చివరి క్షణాల్లో ఏం కనిపిస్తుందో తెలిస్తే షాకవుతారు..
Brain Exercises

Updated on: May 03, 2023 | 8:15 PM

జననం, మరణం అనేది మానవ జీవితంలో ఓ సృష్టి రహస్యాలుగా ఉంటాయి. జననం విషయంలో వైద్యులు శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందారు. అయితే మరణం విషయంలో కొంతమేర వెనుకబడ్డారు. ముఖ్యంగా మరణించిన తర్వాత మనం ఏం అవుతాం? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అలాగే మరణానికి ముందు అంటే చివరి క్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి ఉంటుంది. ముఖ్యంగా పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నారు. మెదడులోని రహస్యాలను ఛేదించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూరో సైంటిస్టులు నిమగ్నమై ఉన్నారు. పరిశోధకుల బృందం ఇప్పుడు చనిపోయే అంచున ఉన్న ఇద్దరు వ్యక్తుల మెదడుల్లో కార్యకలాపాల్లో రహస్యమైన పెరుగుదలను గుర్తించింది. పరిశోధకులు చాలా కాలంగా మెదడు విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయే ముందు చివరి క్షణాలలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జంతువుల్లో చేసిన పరిశోధనల్లో గామా తరంగాల పెరుగుదలను కనుగొన్నారు. ముఖ్యంగా అవి కార్డియాక్, రెస్పిరేటరీ అరెస్ట్‌లోకి వెళ్లాయి. అయితే మనిషి మెదడులో జరిగే ప్రతిస్పందనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

మానవ మెదడులో కూడా జంతువుల్లో ఎలాంటి చర్యలు కనిపించాయో? అలాంటివే కనిపించాయి. ముఖ్యంగా గామా తరంగాలు మెదడులోని ఓ భాగంలో స్పష్టం కనిపించాయి. ఈ తరంగాలు మెమరీ ప్రాసెసింగ్‌తో సంబంధం కలిగి ఉంటాయని తేలింది. మరణిస్తున్న వ్యక్తి  చివరి క్షణాలలో మెదడులో ఏమి జరుగుతుందో బాగా అర్థం చేసుకోవడానికి యూఎస్ ఆధారిత మిచిగాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నలుగురు మరణిస్తున్న రోగుల్లో ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ (ఈఈజీ), ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) సంకేతాలను వెంటిలేటరీ సపోర్ట్‌ను ఉపసంహరించుకోవడానికి ముందు, తర్వాత విశ్లేషించారు. ఈ పరీక్షలు చేసే సమయంలో నలుగురు రోగులు కోమాలో ఉన్నారు. అయితే వీరిలోని ఇద్దరు రోగుల్లో గామా కార్యకలాపాలు పెరగడం ద్వారా హైపోక్సియా (మెదడులో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం) గుర్తించారు. కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడు పనితీరు సరిగా అర్థం కాకపోయినా బహిరంగ స్పృహ కోల్పోవడం అనేది కార్డియాక్ అరెస్ట్‌తో స్థిరంగా సంబంధం కలిగి ఉంటుంది. అలాగే మరణిస్తున్న ప్రక్రియలో రోగులు రహస్య స్పృహను కలిగి ఉండగలరా అనే విషయం అస్పష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

2014 నుంచి న్యూరో-ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మరణించిన రోగుల కేసులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారు మెదడులోని ఒక భాగంలో గామా తరంగాలు ఒక దీర్ఘ-శ్రేణిని స్థాపించడాన్ని గమనించారు. మెదడుకు సంబంధించిన రెండు అర్ధగోళాల్లో కనెక్షన్‌ను కూడా కనుగొన్నారు. అలాగే తల వెనుక భాగంలో ఉన్న దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించే పొస్టిరియర్ క్రోటికల్ ప్రాంతాలు మరణిస్తున్న మానవ మెదడులో సక్రియంగా ఉందా? లేదా? అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం