Egg-Cholesterol: గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా..? ఇందులో నిజమెంత..?

|

Apr 13, 2022 | 12:31 PM

Egg-Cholesterol: ఆరోగ్యం విషయంలో కొన్ని చేయాల్సినవి, చేయకూడనివి ఉన్నాయి. ఆహారంలో కొన్ని ఆహారాలు తప్పనిసరిగా చేర్చబడినప్పటికీ, వాటిని మితంగా తీసుకోవాలి. వాటిలో..

Egg-Cholesterol: గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా..? ఇందులో నిజమెంత..?
Follow us on

Egg-Cholesterol: ఆరోగ్యం విషయంలో కొన్ని చేయాల్సినవి, చేయకూడనివి ఉన్నాయి. ఆహారంలో కొన్ని ఆహారాలు తప్పనిసరిగా చేర్చబడినప్పటికీ, వాటిని మితంగా తీసుకోవాలి. వాటిలో గుడ్లు (Eggs) ఉన్నాయి. గుడ్డు విషయంలో కొందరికి ఓ అపోహాలు బలంగా ఉంది. అదేంటంటే.. గుడ్లు ఎక్కువ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ వస్తుందని. అయితే అందులో నిజం ఎంత? పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ ప్రకారం.. ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ ‘తాజాగా సురక్షితమైనది’. ‘కేక్ మిశ్రమాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, డీహైడ్రేటెడ్ పాలు, ప్రాసెస్ చేసిన మాంసాలలో గుడ్డు ఆక్సిడైజ్ అయినప్పుడు మాత్రమే హానికరం అవుతుంది. వాటిలోని కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందుతుంది. అలాగే ఇది ధమనులను అడ్డుకునే అవకాశం ఉంది అని ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.

మీరు ‘సాధారణ కొలెస్ట్రాల్’ కలిగి ఉంటే,’ ఎలాంటి ప్రమాదం ఉండదు. చురుకైన ఆరోగ్యకరమైన జీవనశైలిని’ కొనసాగించినట్లయితే మీరు ప్రతిరోజూ ఒక గుడ్డు ‘కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి చింతించకుండా’ తినవచ్చు అని వివరించారు. మరోవైపు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినడం మంచిదని, పచ్చసోనను వదిలేయడం మంచిదని సూచిస్తున్నారు. ‘గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుడ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవని ఎన్నో అధ్యయనాల్లో తేలాయని ముఖర్జీ తన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

? గుడ్డులో అత్యుత్తమ నాణ్యమైన ప్రొటీన్‌ ఉంటుంది.
? రక్తంలో చక్కెరను సమం చేయడానికి సహాయపడుతుంది.
? తక్కువ బ్లడ్ షుగర్‌తో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
? రక్తహీనతతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
? అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు, ఖనిజాలతో నిండి ఉన్నాయి.

 

ఇవి కూడా చదవండి:

Pregnancy Care: ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి ఉద్యోగం చేసే మహిళ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి

Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్‌ లోపమే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అందించడం జరిగింది. ఏదైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)