AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల్లో గుండె సమస్యలకు మెయిన్ రీజన్ ఇదే.. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి..!

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త రిసెర్చ్ ప్రకారం.. పిల్లల్లో ఎక్కువ స్క్రీన్ టైమ్ భవిష్యత్తులో గుండె సమస్యలకు దారి తీస్తుంది. మొబైల్, టాబ్లెట్, టీవీ వాడకం వల్ల నిద్రలో లోపం, ఊబకాయం, బీపీ మార్పులు వస్తున్నాయి. అందుకే పేరెంట్స్ తప్పనిసరిగా పిల్లల్లో స్క్రీన్ టైమ్ కంట్రోల్ చేసి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయాలి.

పిల్లల్లో గుండె సమస్యలకు మెయిన్ రీజన్ ఇదే.. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి..!
Kids Screen Time
Prashanthi V
|

Updated on: Aug 16, 2025 | 8:43 PM

Share

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో వచ్చిన ఓ రిసెర్చ్ ప్రకారం.. ఎక్కువసేపు మొబైల్, టాబ్లెట్, టీవీ స్క్రీన్‌ల ముందు గడిపే పిల్లలు, టీనేజర్లకు భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇది పేరెంట్స్‌కి ఒక వార్నింగ్ లాంటిదే. పిల్లల హెల్త్‌కు స్క్రీన్ టైమ్ తగ్గించి హెల్దీ హ్యాబిట్స్ నేర్పించడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ స్టడీ గుర్తు చేస్తుంది.

పిల్లల లైఫ్‌స్టైల్

ఆన్‌లైన్ క్లాసులు, వీడియో గేమ్స్, యూట్యూబ్, స్ట్రీమింగ్ కంటెంట్.. ఇవన్నీ చిన్న వయసులోనే పిల్లలను స్క్రీన్‌ లకు అడిక్ట్ చేస్తున్నాయి. కొంతమంది పిల్లలు నిద్రపోయే ముందు కూడా మొబైల్ వాడటం మానుకోరు. దీని వల్ల వారి ఏకాగ్రత, మెంటల్ హెల్త్ మాత్రమే కాకుండా గుండె పనితీరుపై కూడా నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందని పరిశోధకులు అంటున్నారు.

షాకింగ్ ఫ్యాక్ట్స్

ఈ రీసెర్చ్‌లో 1000 మందికి పైగా పిల్లలను రెండు నెలల పాటు గమనించారు. వారి నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ, బరువు, బీపీ, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లాంటివి కొలిచారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?

  • రోజుకు అదనంగా గడిపే ప్రతి గంట స్క్రీన్ టైమ్ 6 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో గుండె జబ్బు రిస్క్‌ను 0.08 శాతం పెంచింది.
  • టీనేజర్లలో అదే రిస్క్ 0.13 శాతం వరకూ పెరిగింది.
  • సరైన నిద్రతో ఈ ప్రభావాన్ని సుమారు 12 శాతం వరకు తగ్గించవచ్చని తేలింది.

పిల్లలకి ఎందుకు ఇంపార్టెంట్..?

ఈ స్టడీ అమెరికాలో జరిగినప్పటికీ.. దీని ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలకూ వర్తిస్తుంది. మన దేశంలోనూ పిల్లలు ఎక్కువగా మొబైల్ వాడుతున్నారు. రాత్రిపూట స్క్రీన్ వాడకం నిద్రను డిలే చేస్తుంది. బ్లూ లైట్ కారణంగా హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీని వల్ల ఊబకాయం, ఇన్సులిన్ సమస్యలు, బీపీలో మార్పులు.. ఇవన్నీ గుండె జబ్బులకు దారి తీస్తాయి.

పేరెంట్స్ చేయాల్సిన పనులు

  • స్క్రీన్ టైమ్‌కు లిమిట్ పెట్టండి.. రోజుకు 2 గంటలకు మించి పిల్లలు గాడ్జెట్ వాడకూడదని స్ట్రిక్ట్ రూల్ పెట్టండి.
  • స్క్రీన్ ఫ్రీ జోన్‌లు క్రియేట్ చేయండి.. బెడ్ రూమ్ లేదా భోజన సమయంలో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడకూడదని అలవాటు చేయండి.
  • నిద్రకు ముందు ఒక గంట స్క్రీన్ లేదు.. బుక్స్ చదవడం, స్టోరీలు చెప్పడం, మ్యూజిక్ వినడం లాంటివి నేర్పించండి.
  • ఎక్సర్‌సైజ్, ఫిజికల్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వండి.. గేమ్స్, డ్యాన్స్, సైక్లింగ్ లాంటి వాటిలో పిల్లలను యాక్టివ్‌గా ఉంచండి.
  • పేరెంట్స్ రోల్ మోడల్‌గా ఉండాలి.. పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి మీరు కూడా ఫోన్ వాడకాన్ని తగ్గించి ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైమ్ గడపండి.
  • స్క్రీన్ టైమ్ కంట్రోల్ ఫీచర్లు వాడండి.. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఈ ఫీచర్లను ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి.
  • నిద్ర సైకిల్‌ను సెట్ చేయండి.. వారంలో ప్రతి రోజు ఒకే టైమ్‌కు పడుకోవడం అలవాటు చేయండి.

పిల్లల ఆరోగ్యంపై ప్రతి స్క్రీన్ నిమిషం ఎఫెక్ట్ చూపుతుంది. గాడ్జెట్ వాడకాన్ని కంట్రోల్ చేయడం, సరైన నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ.. ఇవే భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా కాపాడగల ముఖ్యమైన మార్గాలు.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..