Winter: చలికాలం పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. లేకంటే ప్లూ, న్యూమోనియా రావొచ్చు..

చలికాలం పెరుగుతున్న కొద్దీ, పిల్లలకు ఫ్లూ, న్యూమోనియా రావొచ్చు. చాలా మంది పిల్లలలో జలుబు, దగ్గు ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది...

Winter: చలికాలం పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. లేకంటే ప్లూ, న్యూమోనియా రావొచ్చు..
Child

Updated on: Dec 22, 2021 | 9:41 PM

చలికాలం పెరుగుతున్న కొద్దీ, పిల్లలకు ఫ్లూ, న్యూమోనియా రావొచ్చు. చాలా మంది పిల్లలలో జలుబు, దగ్గు ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న చలి నుంచి వారిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

తక్కువ ఉష్ణోగ్రత పిల్లలకు ప్రమాదకరమని రుజువు చేస్తుందని అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిక్స్ విభాగం డాక్టర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. చలి నుంచి పిల్లలను రక్షించడం అవసరమన్నారు. పిల్లలకు ఉన్ని బట్టలు వేయాలి. పిల్లల తల, చెవులు ఎల్లప్పుడూ కప్పబడి ఉండేలా చూడాలన్నారు. నిద్రపోయేటప్పుడు, పిల్లలకు రాత్రంతా దుప్పటి కప్పి ఉంచే విధంగా చూడాలని చెప్పారు.

శీతాకాలంలో పిల్లలలో న్యూమోనియా సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి నిరంతర దగ్గు ఉంటే. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, అది న్యూమోనియా లక్షణం. ఈ సందర్భంలో వెంటనే చికిత్స చేయాలి. ఈ సమస్యను తేలికగా తీసుకోకూడదు. అంతే కాకుండా పిల్లలకు జ్వరం వచ్చి రెండు రోజులు గడిచినా తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎప్పుడూ మీరే మందులు ఇవ్వకండి.

Read Also.. Benefits of Black Carrot: చలికాలంలో బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు..అవేంటో తెలుసా..