Weight Loss Tips: బరువు తగ్గాలంటే…ఇంట్లోనే సులభంగా తయారు చేసే ఈ జ్యూస్‎లు ఓసారి ట్రై చేసి చూడండి..!!

నేటికాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు అధిక బరువుకు కారణం అవుతున్నాయి. బరువు పెరగడం ఈజీ కానీ..తగ్గడం అంత తేలికైన పనికాదు.

Weight Loss Tips: బరువు తగ్గాలంటే...ఇంట్లోనే సులభంగా తయారు చేసే ఈ జ్యూస్‎లు ఓసారి ట్రై చేసి చూడండి..!!
Weight Lose Tips

Edited By: Janardhan Veluru

Updated on: Feb 20, 2023 | 5:11 PM

నేటికాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు అధిక బరువుకు కారణం అవుతున్నాయి. బరువు పెరగడం ఈజీ కానీ..తగ్గడం అంత తేలికైన పనికాదు. అందుకోసం చాలా కష్టపడాల్సిందే. బరువు తగ్గడానికి ప్రతిరోజూ వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి…మీరు రోజూ తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఇవే కాకుండా డైట్ లో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు కూడా చేర్చుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పానీయాలు త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. అంతేకాదు మీ జీవక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి.

మీరు బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటే మీకు సహాయపడే కొన్ని పానీయాల గురించి తెలుసుకుదాం. ఈ పానీయాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఆ పానీయాలేంటో ఓసారి చూద్దాం.

మీ బరువును తగ్గించే 5 పానీయాలు:

1. నిమ్మరసం:

పరగడుపున నిమ్మరం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెడుతుంది. గుండె ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. నిమ్మకాయ నీరు ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆమ్లం మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి నిమ్మకాయ రసం మంచి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వాకింగ్ వెళ్లేటప్పుడు ఒకగ్లాసులో సగం నిమ్మకాయను పిండుకుని తాగండి. మీకు  తియ్యగా కావాలనుకుంటే అందులో కొంచెం తేనెను కలుపుకోవచ్చు. రుచితో పాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

2. పసుపు పాలు:

బరువు తగ్గాలనుకునేవారికి పసుపు పాలు పర్ఫెక్టుగా పనిచేస్తాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని వైద్యపరంగా ఉపయోగించడమే కాకుండా…వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో దీనిని చర్మ రుగ్మతలు, అలెర్జీలు, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులకు నివారిణిగా ఉపయోగిస్తున్నారు. పసుపు పాలు పడుకునేముందు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఉదయం పూట తాగితే కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. పసుపుపాలు ప్రతిరోజూ తాగినట్లయితే ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ప్రతిరోజూ పసుపుపాలు తాగినట్లయితే శరీర కొవ్వు కోల్పోతుందని వైద్యనిపుణు చెబుతున్నారు.

3. సిట్రస్ నీరు:

త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల వాటర్ రెసిపిలను ప్రయత్నించవచ్చు. రోజు కేవలం నీటిని మాత్రమే తాగాలంటే కాస్త బోర్ గా ఫీల్ అవుతుంటాం. అందుకే నిమ్మ, పుదీనా,దోసకాయ, నారింజ ముక్కలను కలిపి సిట్రస్ నీటిని తయారు చేసుకోవచ్చు. శరీరం నిర్విషీకరణలో ఈ సిట్రస్ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే బరువు తగ్గుతారు.

4. గ్రీన్ టీ:

గ్రీన్ టీ బరువు తగ్గించడంతోపాటు జీవక్రియను పెంచేందుకు సహాయపడుతుంది. గ్రీన్ టీలో కెఫీన్ వంటి ముఖ్యమైన బయోయాక్టివ్ పదార్థాలు, కాటెచిన్స్ అనే ఒక రకమైన పాలిఫెనాల్స్ ఉన్నాయి. ఇవి శరీర జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ బరువును తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్నింగ్ డిటాక్స్ డ్రింక్. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీబాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. బలమైన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. గ్రీన్ లో తేనె, నిమ్మ, పుదీనా ఆకులను చేర్చుకుని తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.

5. అజ్వైన్ నీరు:

బరువు తగ్గాలనుకునే వారు క్యారమ్ విత్తనాలను (అజ్వైన్) నీటితో ఎక్కువగా తీసుకుంటారు. అజ్వైన్ నీరు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం పరగడపునే ఈ నీటిని తాగినట్లయితే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. ఒక నెలలో 4-5 కిలోగ్రాముల బరువు తగ్గవచ్చు. ఒక టీస్పూన్ క్యారమ్ గింజలను ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారు పైన పేర్కొన్న పానీయాలను మీ ఉదయపు దినచర్యలో చేర్చుకోండి. ఇవి బరువు తగ్గించడంతోపాటు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మానసికస్థితిని కూడా మెరుగుపరచడంలో కీలకం పనిచేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఆరోగ్య వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి