Keto Diet: కీటో డైట్‌తో బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. జర జాగ్రత్త..

| Edited By: Janardhan Veluru

Mar 18, 2023 | 12:51 PM

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనేది పాత సామెత. కొవ్వును కొవ్వుతోనే కోసేయాలి, అనేది కీటో డైట్ పాటించే వారి సామెత.

Keto Diet: కీటో డైట్‌తో బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. జర జాగ్రత్త..
Keto Diet
Follow us on

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనేది పాత సామెత. కొవ్వును కొవ్వుతోనే కోసేయాలి అనేది కీటో డైట్ పాటించే వారి సామెత. అవును శరీరంలో కొవ్వును కరిగించాలంటే డైట్ లో మరింత కొవ్వును చేర్చి కీటో డైట్ పాటించాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే మనదేశంలోని చాలా పట్టణ ప్రాంతాలలో కీటో డైట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే, కీటోజెనిక్ ఫుడ్ లేదా కీటో డైట్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్స్ వార్షిక సైంటిఫిక్ సెషన్‌లో సమర్పించిన అధ్యయనంలో కీటో వంటి ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఇది ఛాతీ నొప్పి, క్లాటింగ్ లేదా హార్ట్ స్ట్రోక్ మొదలైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని పరిశోధనలో తేల్చి చెప్పారు.

చెడు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది:

ఇవి కూడా చదవండి

బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ హార్ట్ లంగ్ ఇన్నోవేషన్ హెల్తీ హార్ట్ ప్రోగ్రామ్ ప్రివెన్షన్ క్లినిక్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ లులియా లుటన్ ఇలా అన్నారు, “కార్బోహైడ్రేట్లు తక్కువగానూ, కొవ్వు అధికంగా ఉండే కీటో డైట్ ఆహారం తసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని, అయితే గుండెల్లో బ్లాకులు సృష్టించే చెడు కొలెస్ట్రాల్ అయిన LDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేందుకు కీటో డైట్ లోని పదార్థాలు దోహదం చేస్తాయని, అందుకే కీటో డైట్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

రిపోర్ట్ ఏమి చెబుతుంది:

కీటో డైట్ వంటి తక్కువ కార్బోహైడ్రేట్ అధిక కొవ్వు ఆహారాలు, శరీరంలోని శక్తికి ప్రాథమిక వనరు అయిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని పరిమితం చేస్తాయి. కీటో డైట్ లో, మొత్తం రోజువారీ కేలరీలలో 25% కార్బోహైడ్రేట్ల నుండి, 45% వరకు కొవ్వుల నుండి లభిస్తుందని డాక్టర్ లాటన్ చెప్పారు. అయితే, కీటో డైట్ నిపుణులు మాత్రం సాధారణంగా కార్బోహైడ్రేట్‌లను రోజువారీ కేలరీలలో 10%, ప్రోటీన్‌లను 20 నుండి 30% వరకు పరిమితం చేయాలని కొవ్వు నుంచి 60 నుండి 80% కేలరీలను పొందాలని సూచిస్తున్నారు.

UK పౌరులపై అధ్యయనం జరిగింది:

పరిశోధన బృందం UKలో కనీసం 10 రోజులు నివసించిన అర మిలియన్ కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి డేటాను విశ్లేషించింది. వారి కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేసారు. డాక్టర్ లాటన్ పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. “కీటో డైట్‌లో ఉన్నవారిలో అత్యధిక స్థాయిలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. కీటో డైట్‌ తీసుకునే వ్యక్తులు సమతుల ఆహారం వైపు వెళ్లాలని, కొవ్వు అధికంగా తీసుకుంటే ప్రమాదకరమైని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.