Health Tips: 40 ఏళ్ల తర్వాత అందంగా కనిపించాలంటే ఈ 5 ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..

|

May 31, 2022 | 8:07 PM

Health Tips:నలబై ఏళ్ల వయసు దాటారంటే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది. కొందరికి కళ్ల చుట్టూ ముడతలు ఏర్పడుతాయి.

Health Tips: 40 ఏళ్ల తర్వాత అందంగా కనిపించాలంటే ఈ 5 ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..
Beautiful
Follow us on

Health Tips:నలబై ఏళ్ల వయసు దాటారంటే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది. కొందరికి కళ్ల చుట్టూ ముడతలు ఏర్పడుతాయి. మీరు ఈ వయస్సు ప్రభావాన్ని తొలగించాలనుకుంటే కొన్ని ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. తద్వారా చర్మం సహజమైన మెరుపును పొందుతుంది. వయస్సు ప్రభావాన్ని తగ్గించే 5 ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజూ కనీసం రెండు మూడు సార్లు టీకి బదులు గ్రీన్ టీ తాగాలి. అయితే టీ, కాఫీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. గ్రీన్ టీలో చక్కెర లేదా పాలు ఉపయోగించవద్దు.

ఇవి కూడా చదవండి

టమోటా

టమోటాలలో లైకోపీన్ ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. నిత్యం టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఒమేగా-3 రిచ్ ఫుడ్

వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్, సోయాబీన్, క్యాలీఫ్లవర్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, గుడ్లు మొదలైన వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతల సమస్యను తొలగించి చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు.

మొలకెత్తిన ధాన్యాలు

శనగలు, గోధుమలు, సోయాబీన్ మొదలైన వాటిని మొలకెత్తిన తర్వాత రోజూ తినాలి. ఈ ఆహారాలు మీ శరీరంలోని ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని పోషకాల లోపాన్ని తొలగిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం తాజాగా ఉంటుంది.

నీరు

నీరు మీకు సాధారణ విషయంగా అనిపించవచ్చు కానీ మీ శరీరం, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్‌ ఎలిమెంట్స్ బయటకు రావడం వల్ల చర్మంపై మెరుపు వస్తుంది. శరీరం అన్ని రోగాలకి దూరంగా ఉంటుంది. చర్మం లోపల నుంచి గ్లో తీసుకొస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి