Black Coffee: మీకు బ్లాక్ కాఫీ.. బ్లాక్ టీ.. డార్క్ చాక్లెట్లు ఇష్టమా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

|

Dec 30, 2021 | 10:14 PM

మీరు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ..డార్క్ చాక్లెట్‌లను ఇష్టపడితే, కొత్త పరిశోధన ప్రకారం మీ అభిరుచులు జన్యుపరమైనవి. కొంతమంది బ్లాక్ కాఫీని రోజూ తీసుకుంటే, కొందరికి అస్సలు ఇష్టం ఉండదని కెఫీన్ పరిశోధకురాలు మార్లిన్ కార్నెలిస్ చెప్పారు.

Black Coffee: మీకు బ్లాక్ కాఫీ.. బ్లాక్ టీ.. డార్క్ చాక్లెట్లు ఇష్టమా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Black Coffee And Dark Chocolate
Follow us on

Black Coffee: మీరు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ..డార్క్ చాక్లెట్‌లను ఇష్టపడితే, కొత్త పరిశోధన ప్రకారం మీ అభిరుచులు జన్యుపరమైనవి. కొంతమంది బ్లాక్ కాఫీని రోజూ తీసుకుంటే, కొందరికి అస్సలు ఇష్టం ఉండదని కెఫీన్ పరిశోధకురాలు మార్లిన్ కార్నెలిస్ చెప్పారు. చేదు టీ, కాఫీ ..చాక్లెట్లను ఇష్టపడే వ్యక్తులు ఒక రకమైన జన్యువును కలిగి ఉంటారు. దాని కారణంగా వారు మళ్లీ మళ్లీ ఈ విషయాల వైపు ఆకర్షితులవుతారు.

పరిశోధన ఏం చెబుతోంది?

నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, చేదు ఆహార పదార్థాల ఎంపిక వ్యక్తుల ప్రాధాన్యతలపై ఆధారపడి ఉండదు. కానీ, వారి జన్యువులలో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ జన్యువుతో జన్మించిన వారి మెదడు చేదు రుచుల పట్ల అప్రమత్తంగా ఉంటుంది. దీని కారణంగా, అతను పదేపదే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ..డార్క్ చాక్లెట్ తీసుకుంటాడు. చాలా మంది ప్రజలు చేదును కెఫీన్‌తో ముడిపెడతారని, అందువల్ల వారు మిల్క్ కాఫీ కంటే బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగుతారని కార్నెలిస్ చెప్పారు. చాక్లెట్‌లో కొద్దిగా కెఫిన్ ఉంటుంది కాబట్టి, డార్క్ చాక్లెట్‌ను ఇష్టపడటానికి అదే భావన వర్తిస్తుంది.

అయితే డార్క్ చాక్లెట్‌లో కెఫీన్ కంటే ఎక్కువగా థియోబ్రోమిన్ అనే రసాయనం ఉందని, వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే హార్ట్ బీట్ పెరగడంతో పాటు మూడ్ కూడా చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం, జన్యుపరంగా కాఫీని ఎక్కువగా తీసుకునే వ్యక్తులు ఇతరులకన్నా ఆరోగ్యంగా ఉంటారని తదుపరి పరిశోధన కూడా వెల్లడిస్తుంది.

మిల్క్ కాఫీ కంటే బ్లాక్ కాఫీ ప్రయోజనకరమైనది..

పాలు, పంచదార కలుపుకోవడం కంటే కాఫీ లేదా టీ తాగడం మంచిదని కార్నెలిస్ చెప్పారు. ఈ విషయాలు మొక్కల ఆధారితమైనవి కాబట్టి, వాటిని వాటి సహజ రూపంలో వినియోగించాలి. ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు ..అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సరైన మోతాదులో డార్క్ చాక్లెట్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

డార్క్ చాక్లెట్‌లో చాలా క్యాలరీలు ఉన్నప్పటికీ, దాన్ని రోజూ ఒక్కసారైనా తీసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే డార్క్ చాక్లెట్ కోకో నుంచి తయారవుతుంది, ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి: China: అమ్మో చైనా చిన్న ఎత్తు వెయ్యలేదు కదా.. చలికాలంలో సైనికులను రక్షించడానికి ఏం చేసిందో తెలిస్తే అడిరిపోతారు!

Omicron Identification: జలుబు.. ఒమిక్రాన్ లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి.. అటువంటప్పుడు కరోనాను గుర్తించడానికి ఏమి చేయాలి?

Think Message: ఇకపై మీరు మెసేజ్ టైప్ చేయక్కర్లేదు.. అనుకోండి అంతే సందేశం సిద్ధం అయిపోతుంది..ఎలా అంటే..