Kitchen Hacks: గసగసాలతో గంపెడు లాభాలు.. ఏంటో తెలిస్తే అస్సలు మిస్ చేయరు!!

నాన్ వెజ్ లో మసాలాలతో వండే కూరలు ఏవైనా.. అందులో గసగసాలు పడాల్సిందే. మనదేశంలో తెల్లగా ఉండే గసగసాలను వాడుతాం. చూడటానికి ఇసుక రేణువుల మాదిరి చాలా చిన్నగా ఉండే.. గసగసాల్లో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు కూడా గసగసాలను వాడొచ్చని చాలా మందికి తెలియదు. గసగసాలను రోజూ తింటే.. బరువులో మార్పు ఖచ్చితంగా వస్తుంది. గసగసాలలో ఉండే జింక్ థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రిస్తుంది. అలాగే వీటిలో ఉండే మాంగనీస్..

Kitchen Hacks: గసగసాలతో గంపెడు లాభాలు.. ఏంటో తెలిస్తే అస్సలు మిస్ చేయరు!!
Poppy Seeds

Updated on: Aug 26, 2023 | 5:35 PM

నాన్ వెజ్ లో మసాలాలతో వండే కూరలు ఏవైనా.. అందులో గసగసాలు పడాల్సిందే. మనదేశంలో తెల్లగా ఉండే గసగసాలను వాడుతాం. చూడటానికి ఇసుక రేణువుల మాదిరి చాలా చిన్నగా ఉండే.. గసగసాల్లో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు కూడా గసగసాలను వాడొచ్చని చాలా మందికి తెలియదు. గసగసాలను రోజూ తింటే.. బరువులో మార్పు ఖచ్చితంగా వస్తుంది.

షుగర్ కంట్రోల్: గసగసాలలో ఉండే జింక్ థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రిస్తుంది. అలాగే వీటిలో ఉండే మాంగనీస్.. షుగర్ ను నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది.

అనేక వ్యాధులకు చెక్: గసగసాలలో ప్రొటీన్, ఫైబర్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-6, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. గుండె, జీర్ణవ్యవస్థ, జుట్టు, చర్మం, నిద్రలేమి, షుగర్, ఎముకలు, నరాల సమస్యలు సహా ఇంకా అనేక వ్యాధులపై గసగసాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

సంతానోత్పత్తిని పెంచుతుంది: స్త్రీలకు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలుంటే.. వారు గసగసాలను ఆహారంలో చేర్చుకుంటే చాలు. ఫెలోపియన్ ట్యూబ్ నుంచి శ్లేష్మాన్ని తొలగించి సంతానోత్పత్తిని పెంచుతుంది.

చర్మ, చుండ్రు సమస్యలు ఉండవు: గసగసాలలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ పదార్థాలుంటాయి. చర్మానికి సంబంధించిన ఎగ్జిమా సమస్యను తగ్గిస్తాయి. గసగసాలను మెత్తని పేస్ట్ లా చేసి నిమ్మరసం కలిపి దురదగా ఉన్న ప్రదేశంపై అప్లై చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే చుండ్రును తగ్గించుకునేందుకు గసగసాలలో పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

ఎముకలు బలంగా ఉంటాయి: గసగసాలలో కాల్షియం, కాపర్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు బలహీనంగా, నొప్పిగా ఉంటే గసగసాలు తినడం మంచిది. గసగసాలు ఎముకలను బలపరుస్తాయి. మాంగనీస్, ప్రొటీన్.. కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: గసగసాలలో బయోయాక్టివ్ పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి.. ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో.. జ్వరం, చలి, గొంతునొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడంలో పనిచేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి