Weight Loss: బరువు తగ్గడం కోసం తిండి మానేస్తున్నారా? ఈ విధంగా చేస్తే కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గుతారు!

పెరిగిపోతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో తిప్పలు పడతారు అందరూ. చాలా మంది తమ ఆహార విధానాల్లో మార్పులు చేసుకుని.. దాదాపుగా తిండి మానేసే పరిస్థితికి వస్తారు.

Weight Loss: బరువు తగ్గడం కోసం తిండి మానేస్తున్నారా? ఈ విధంగా చేస్తే కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గుతారు!
Weight Loss
Follow us
KVD Varma

|

Updated on: Dec 05, 2021 | 5:23 PM

Weight Loss: పెరిగిపోతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో తిప్పలు పడతారు అందరూ. చాలా మంది తమ ఆహార విధానాల్లో మార్పులు చేసుకుని.. దాదాపుగా తిండి మానేసే పరిస్థితికి వస్తారు. గోధుమ రొట్టెలతో కూడా బరువు పెరిగిపోతామని భయపడేవారున్నారు. అయితే, బరువు తగ్గాలంటే రోటీలు తినడం మనేయక్కర్లేదు. అదేవిధంగా ఆహారాన్ని కంట్రోల్ చేసుకునే వారు తమ శరీరానికి కావలసిన కనీస పోషకాలను పొందాలంటే కొన్నిరకాల పిండితో చేసే రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతారు. ఉత్తరభారత దేశంలో ఎక్కువగా ఈ విధమైన పిండి తో చేసిన రోటీలు తినడం ద్వారా ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు అక్కడి ప్రజలు. డైటింగ్ చేయాలి.. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ రోటీలను తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా బరువు తగ్గొచ్చు. రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు.. ఈ పిండిలో లభిస్తాయని నిపుణులు అంటున్నారు. అవేమిటో.. వాటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1-జొన్న పిండి

మీరు బరువు తగ్గాలనుకుంటే, జొన్న పిండిని ఆహారంలో చేర్చండి. ఎందుకంటే, జొన్న పిండి గ్లూటెన్ రహితం. ఇది ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేని వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఈ పిండి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, మంచి గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడానికి కూడా ఉత్తమమైనది. ఈ పిండిని కలుపుకునేటప్పుడు మీరు దీనికి కొద్దిగా గోధుమ పిండిని కూడా జోడించవచ్చు.

2- రాగి పిండి

రాగి పిండి కూడా గ్లూటెన్ ఫ్రీ. ఫైబర్, అమైనో ఆమ్లాలు ఇందులో కూడా ఉంటాయి. దీని రోటీని తినడం ద్వారా, కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు, మీ పొట్టకు దీనిని జొన్నలాగా జీర్ణం చేయడం సులభంగా ఉంటుంది.

3- మిల్లెట్ పిండి

బజ్రా పిండి కూడా గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఇతర పోషకాలు ఈ పిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే, ఇది మిమ్మల్ని అతిగా తినకుండా కూడా నిరోధిస్తుంది ఎందుకంటే ఈ పిండిని తిన్న తర్వాత, మీకు చాలా సేపటి వరకూ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దాని రొట్టె తిన్న తర్వాత, దాహం కూడా ఎక్కువగా వేస్తుంది. దీనివలన శరీరంలోకి నీటిని కూడా ఎక్కువ తీసుకుంటారు.

4- వోట్స్ పిండి

ఓట్స్ పిండి మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. ఈ పిండిలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది గుండె జబ్బులకు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అంతే కాదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి: EPF and LIC: మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది తెలుసా? ఇదెలా సాధ్యమంటే..

Omicron: వామ్మో ఒమిక్రాన్.. ఇది ఎందుకు వేగంగా విస్తరిస్తుందో తెలిసింది..ఇది సాధారణ వేరియంట్ కాదు.. అంతకుమించి!

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!