Anemia: మీరు తరచుగా అలసట, నీరసానికి గురైనట్లైతే అది రక్తహీనత కావొచ్చు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స తీసుకోకుంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించడం ముఖ్యం. ఒక వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అతనికి ఈ సమస్య ఉందని అర్థం. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి నిరంతరం తగ్గడం ప్రారంభమవుతుంది. రక్త నష్టం జరుగుతుంది. రక్తహీనత కారణంగా అనేక ఇతర వ్యాధులు ప్రబలుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి జీవితాంతం కొనసాగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు తలసేమియా వ్యాధి ఉంటే రక్తహీనత వచ్చే అవకాశాలు 50 శాతం ఎక్కువగా ఉంటాయి. జీవనశైలి సరిగా లేని వ్యక్తులకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
ఇవి రక్తహీనత లక్షణాలు..
1. తలతిరగడం, తలనొప్పి, చల్లని చేతులు, కాళ్ళు, క్రమరహిత హృదయ స్పందన, అలసట, నీరసం ఉంటాయి.
గర్భిణీ స్త్రీలకు మరింత ఇబ్బంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది గర్భిణీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గర్భిణీలలో రక్తహీనత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలపై కూడా ప్రభావం చూపుతాయి. స్త్రీకి రక్తహీనత ఉంటే ప్రసవ సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. క్యారెట్, టొమాటో, ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చుకోండి. అలాగే విటమిన్ ఎ, బిలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. మీరు ఈ వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.