Ice Apples: ప్రకృతి వర ప్రసాదం తాటి ముంజలు.. వేసవి తాపాన్ని తీర్చడమే కాదు.. క్యాన్సర్‌కు చెక్

|

Mar 17, 2022 | 4:38 PM

Ice Apples: మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి(Summer heat) తాపం నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు, సరైన ఆహారం తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మండుతున్న ఎండలకు తోడు..

Ice Apples: ప్రకృతి వర ప్రసాదం తాటి ముంజలు.. వేసవి తాపాన్ని తీర్చడమే కాదు.. క్యాన్సర్‌కు చెక్
Ice Apple Benefits
Follow us on

Ice Apples: మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి(Summer heat) తాపం నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు, సరైన ఆహారం తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు ( Heat Waves)కూడా తోడైతే.. అనారోగ్యం బారిన పడే అవకాశం అధికంగా ఉంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలంలో అందరికి అందుబాటులో ఉండి అటు ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని అందించే ఫలాల్లో తాటి ముంజలు ముందు వరుసలో ఉంటాయి. తాటి ముంజలు ప్రకృతి వరప్రసాదం. వీటిని ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తారు. వేసవి కాలంలో మాత్రమే దొరికే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. విటమిన్- ఏ, బీ, సీ, ఐరన్, జింక్, ఫాస్పరస్, ఫొటాషియం, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని వేసవిలో అధికంగా తినడం వలన ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.

వేసవి వచ్చిందంటే తాటి ముంజలు కోసం అందరూ ఎదురుచూస్తూంటారు.మండు వేసవిలో ముంజలు తింటే ఉష్ణతాపానికి చెక్ పెట్టవచ్చు. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది. ఇప్పుడు తాటిముంజలు ప్రజలకు అత్యంత అందుబాటులో అంటే పల్లెలు ,  పట్టణం తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి.  ఈరోజు తాటి ముంజెలను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  1. *వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ పెరుగుతుంది. ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  2. *ఎండాకాలం ఈ తాటి ముంజల్లో ఎక్కువ తేమ, తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి. అందుకే చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు మేలు చేస్తాయి.
  3. *ఈ తాటి ముంజెలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు దాహార్తిని కూడా తీరుస్తాయి. తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక నీటిశాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి.
  4. * శరీర బరువును తగ్గించడంలో  ముంజులు సహాయపడతాయి.
  5. *ముంజెల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.  శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తాయి.
  6. * వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ తగ్గి.. దాని స్థానంలో మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
  7. *మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కేన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి. ట్యూమర్, బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి.
  8. *గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రిన్ లను బ్యాలెన్స్ చేయడంలో ముంజలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
  9. *వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారిస్తుంది.

Also Read: Corona Virus: ఆ దేశంలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులో 6 లక్షల కరోనా కొత్త కేసులు.. ఆసియా దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న బాధితులు