BIRRD Hospital – Tirupati : తిరుమల తిరుపతి దేవస్థానం ‘బర్డ్ ట్రస్టు’ ఆసుపత్రిలో స్వచ్ఛందంగా విజిటింగ్ కన్సల్టెంట్లుగా సేవలందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్లు దరఖాస్తు చేసుకోవాలని టిటిడి ఇచ్చిన ఆహ్వానానికి అనూహ్య స్పందన లభించింది.
ఆర్థోపెడిక్ రంగంలో ప్రముఖులైన వారు దేశంలోని నలుమూలల నుంచి 90 మందికి పైగా టిటిడికి తమ దరఖాస్తులు పంపారు. ఈ దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పలువురు ప్రముఖ డాక్టర్లను ఎంపిక చేయడం జరిగింది. వీరిలో కొందరు డాక్టర్లు నెలకు ఒకసారి, కొందరు 15 రోజులకు ఒకసారి తిరుపతిలోని ఆసుపత్రికి వచ్చి రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు.
శ్రీవారి వైద్య సేవల్లో భాగంగా ఇప్పటి వరకు దేశంలోనే ప్రముఖులైన 16 మంది వైద్యులు బర్డ్ ఆసుపత్రికి వచ్చి రోగులకు తమ సేవలు అందించారని, ఆగస్టు 1వ తేదీ నుంచి మిగతా వారి షెడ్యూల్ విడుదల చేయనున్నామని బర్డ్ హాస్పిటల్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి చెప్పారు.
బర్డ్ ఆస్పత్రిలో వైద్య సేవలందించేందుకు తాజాగా ముందుకొచ్చిన ప్రముఖ వైద్యుల వివరాలిలా ఉన్నాయి :
డాక్టర్ కె. కృష్ణయ్య ( FRCS, MCH UK, KIMS Hyderabad)
డాక్టర్ కృష్ణ కిరణ్ ( AWMS Delhi, చీఫ్ కన్సల్టెంట్, మెడి కవర్ హాస్పిటల్)
డాక్టర్ హేమంత్ ( ఆర్థిస్కోపి, బెంగుళూరు) ఇప్పటికే బర్ద్ లో ఓపి సేవలు అందించడంతో పాటు, సంక్లిష్టమైన ఆపరేషన్లు చేశారు.
డాక్టర్ సునీల్ అన్సన్గి (ఎంఎస్ ఆర్థో, పిజిఐ చండీగడ్),
డాక్టర్ ఐ వి రెడ్డి ( కిమ్స్ హెచ్ ఓడి)
డాక్టర్ బాల వర్ధన్ రెడ్డి (ఎంఎస్ ఆర్థో, అపోలో హైదరాబాద్)
డాక్టర్ సాయి లక్ష్మణ్ అన్నే (ఎంఎస్ ఆర్థో, కిమ్స్, హైదరాబాద్)
హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్లు శ్రీ చంద్రశేఖర్ (ఎంఎస్ ఆర్థో), శ్రీ వికాస్ రెడ్డి (ఎంఎస్ ఆర్థో), శ్రీ వినయ్ కిషోర్(ఎంఎస్ ఆర్థో)
వీరితో పాటు చేతుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సునీల్ (ఎంఎస్, హైదరాబాద్)
డాక్టర్ భాస్కర్ ఆనంద్ కుమార్( సీనియర్ కన్సల్టెంట్, మణిపాల్)
డాక్టర్ సూర్య ప్రకాష్ (వెన్నెముక శస్త్ర చికిత్స సీనియర్ నిపుణులు, మెడికవర్, హైదరాబాద్)
డాక్టర్ జె.మధుసూదనరావు (ఎంఎస్ ఆర్థో, సిటి న్యూరో కేర్, హైదరాబాద్)
ఈ ప్రముఖ డాక్టర్లంతా బర్డ్ ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు ఎంపిక చేసిన వారిలో ఉన్నారు. ఈ ప్రముఖ డాక్టర్లంతా ‘బర్డ్’ ఆసుపత్రిలో రోగులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తారని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి చెప్పారు. వీరితోపాటు ఢిల్లీ ఎయిమ్స్ హెచ్ఓడి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా బర్డ్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని రెడ్డప్ప రెడ్డి తెలిపారు.
ఈ సేవలకు ముందుకొచ్చే సర్జన్లు, డాక్టర్లకు టిటిడి పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరు వైద్యసేవలందించేందుకు ఆసుపత్రికి వచ్చినపుడు తిరుమల, తిరుపతిలో వసతి కోసం గది కేటాయిస్తారు. డాక్టర్‌తోపాటు భార్య, పిల్లలకు ఉచితంగా విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. తిరుపతి నుండి తిరుమలకు ఉచితంగా రవాణా వసతి కల్పిస్తారు.
Read also : Revanth : ‘కాయో.. పండో..’ తెలీని డైలమాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ ఎఫర్ట్స్..! వాళ్లంతా చెయ్యిచ్చినట్టేనా..?