Breast Care Tips: వక్షోజాల సంరక్షణకు ఉపయోగపడే ఉల్లి రసం.. ఎలా వాడాలంటే..!!

|

Aug 12, 2023 | 10:39 PM

ఉల్లిపాయలు లేనిదే ఏ కూర వండలేం. ప్రతి కూరలోకి ఉల్లిపాయ ఉండాల్సిందే. అలాగే చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయల్ని విరివిగా ఎలా వాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వక్షోజాల సంరక్షణకు ఉల్లిపాయను ఎలా వాడాలో తెలుసుకుందాం. సాధారణంగా పెళ్లి అయ్యేంత వరకూ బిగుతుగా ఉండే వక్షోజాలు.. పిల్లలకు తల్లయ్యాక వాటి ఆకారం మారిపోతుంది. వక్షోజాలు అలా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి బిగుతుగా ఉండేందుకు రకరకాల ఎక్సర్ సైజ్ లు..

Breast Care Tips: వక్షోజాల సంరక్షణకు ఉపయోగపడే ఉల్లి రసం.. ఎలా వాడాలంటే..!!
Onion Juice
Follow us on

ఉల్లిపాయలు లేనిదే ఏ కూర వండలేం. ప్రతి కూరలోకి ఉల్లిపాయ ఉండాల్సిందే. అలాగే చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయల్ని విరివిగా ఎలా వాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వక్షోజాల సంరక్షణకు ఉల్లిపాయను ఎలా వాడాలో తెలుసుకుందాం. సాధారణంగా పెళ్లి అయ్యేంత వరకూ బిగుతుగా ఉండే వక్షోజాలు.. పిల్లలకు తల్లయ్యాక వాటి ఆకారం మారిపోతుంది. వక్షోజాలు అలా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి బిగుతుగా ఉండేందుకు రకరకాల ఎక్సర్ సైజ్ లు చేయాల్సి ఉంటుంది. ఇంటిపని, వంటపనితోనే రోజంతా గడిచిపోతుందే తప్ప శరీర సంరక్షణకు కేర్ తీసుకునే సమయం ఉండదు. కాబట్టి.. ఈ చిట్కాతో మీ వక్షోజాలను ఆరోగ్యంగా, బిగుతుగా ఉండేలా చేసుకోండి.

ఈ చిట్కాకోసం ముందుగా.. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని.. దానిని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ నుంచి ఉల్లిపాయ రసం తీసి పక్కన పెట్టుకోవాలి.

మరో గిన్నెలో 2 టీ స్పూన్ల ఆముదం, విటమిన్ ఎ క్యాప్సూల్ లో ఆయిల్ ను పోసి బాగా కలపాలి. పక్కన పెట్టుకున్ని ఉల్లిరసాన్ని ఈ మిశ్రమంలో వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రతీసుకుని దానిలో రెండు గ్లాసుల నీరు పోసి స్టవ్ పై పెట్టాలి. ఆ నీటిలో ముందుగా సిద్ధంచేసి పెట్టుకున్న ఉల్లి-ఆముద రసాన్ని కలిపి పెట్టుకున్న గిన్నెను ఉంచాలి. బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గిన్నె నీటిలో తేలుతుంది. నీరు బాగా మరిగేంత వరకూ ఆ పాత్రను నీటిపై ఉంచాలి.

ఇవి కూడా చదవండి

స్టవ్ ఆఫ్ చేసి.. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత.. వక్షోజాలకు రాసి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే వక్షోజాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. బిగుతుగా కూడా తయారవుతాయి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి