AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ఖర్చుతో ఒత్తైన జుట్టు పెరగాలంటే.. వీటితో ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరికీ జుట్టు మంచిగా, బలంగా ఉండాలని కోరిక ఉంటుంది. మన శరీరానికి ఎలా మంచి తిండి అవసరమో.. జుట్టుకు కూడా మంచి పోషణ కావాలి. మనం తినే వాటితో పాటు.. జుట్టు కోసం నాచురల్ గా దొరికే పదార్థాలు వాడితే మంచి మార్పు వస్తుంది. అందులో పెరుగు చాలా మంచిది. పెరుగు వాడితే జుట్టు ఆరోగ్యంగా మారడమే కాకుండా.. చుండ్రు, పొడి జుట్టు, జుట్టు రాలడం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మనం పెరుగుతో చేసే మాస్క్‌ ల గురించి తెలుసుకుందాం.

తక్కువ ఖర్చుతో ఒత్తైన జుట్టు పెరగాలంటే.. వీటితో ఇలా చేయండి..!
Healthy Hair
Prashanthi V
|

Updated on: May 17, 2025 | 6:42 PM

Share

కొంచెం పెరుగులో మెంతి పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి దాదాపు అరగంట పాటు ఉంచండి. ఇది మీ తలమీద పేరుకున్న మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతులు మీ తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.. తద్వారా జుట్టు పెరుగుదలకు ఇది చాలా మంచిది. పెరుగులో తేనె, ఆలివ్ నూనె కలిపి మెల్లగా కలపాలి. దీన్ని తలకు పట్టించాలి. ఇది జుట్టుకు తేమను ఇస్తుంది, పొడి జుట్టును మెత్తగా చేస్తుంది. తేనె వల్ల జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది. ఆలివ్ నూనె తలను చల్లగా ఉంచుతుంది.

గుడ్డులోని పచ్చని సొన, ఆముదం నూనెను పెరుగులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. గుడ్డులోని ప్రోటీన్లు జుట్టు బలంగా తయారవ్వడానికి సాయం చేస్తాయి. ఆముదం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

పెరుగులో కలబంద గుజ్జు, కొబ్బరి నూనె వేసి పేస్ట్ లాగా చేసి తలకు రాయాలి. ఇది జుట్టు రాలడం, చిట్లిపోవడం లాంటి సమస్యలకు మంచిది. కలబంద జుట్టును చల్లబరుస్తుంది, తల చర్మానికి మంచిది. కొబ్బరి నూనె తేమనిచ్చి తలకు పోషణ ఇస్తుంది.

పెరుగులో కొద్దిగా యాపిల్ వెనిగర్, నిమ్మకాయ రసం కలిపి తలకు రాయాలి. ఇది తల మీద ఉన్న చర్మ సమస్యలు తగ్గడానికి సాయం చేస్తుంది. చుండ్రు సమస్యలను పోగొట్టడానికి ఇది మంచి పరిష్కారం. నిమ్మకాయ రసం వల్ల తల శుభ్రం అవుతుంది.

పెరుగులో ఐదు చుక్కల టీ ట్రీ ఆయిల్, ఐదు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి తలకు రాసుకోవాలి. ఈ మిశ్రమం తలలోని క్రిములను చంపి తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. దురద, మంట లాంటి సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.

పెరుగులో తేనె కలిపి తలకు రాసుకోవాలి. జుట్టు చిట్లిపోవడం, తేమ లేకపోవడం లాంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం. జుట్టు మెత్తగా మారడం వల్ల ఒత్తుగా పెరుగుతుంది.

పెరుగులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాయాలి. ఈ మిశ్రమాన్ని తలపై అరగంట సేపు ఉంచి తర్వాత కడగాలి. ఇది జుట్టు పెరగడానికి సాయం చేస్తుంది. పొడిదనాన్ని తగ్గించి జుట్టు మెత్తగా తయారవుతుంది.

జుట్టు కోసం పెరుగు వాడటం అలవాటు చేసుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే నాచురల్ పరిష్కారం. పెరుగుతో చేసే ఈ మాస్క్‌లను వారంలో రెండు సార్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ పదార్థాలు సహజమైనవే అయినా.. కొందరికి అలెర్జీ, అసహనం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ మిశ్రమాలను తలకు ఉపయోగించే ముందు.. మొదట చేతి వెనుక లేదా చెవి కింద భాగంలో కొంచెం మిశ్రమాన్ని రాసి కొంత సమయం వరకు గమనించండి. ఎరుపు, దురద, మంట లాంటి అలర్జీ లక్షణాలు ఏవి కనిపించినా ఇవి వాడకూడదు.