AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనకు కనిపించే పండ్లు అన్నీ మంచివి కావు..! జర కొనేముందు జాగ్రత్త.. చూసి కొనండి..!

వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఈ పండ్లు అంటే చాలా ఇష్టం. రుచిగా ఉండే ఈ పండ్లను ఎవరైనా ఎక్కువ తినాలని అనుకుంటారు. మార్కెట్లో కూడా ఎక్కువగా తీసుకొని ఇంటికి తీసుకెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.

మనకు కనిపించే పండ్లు అన్నీ మంచివి కావు..! జర కొనేముందు జాగ్రత్త.. చూసి కొనండి..!
Mangoes
Prashanthi V
|

Updated on: May 17, 2025 | 7:09 PM

Share

కానీ ఇప్పుడు మార్కెట్లో మామిడి పండ్లు నాచురల్‌గా పండటం కంటే కెమికల్స్ వేసి తొందరగా పండించినవే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి చూడటానికి బాగుంటాయి కానీ లోపల మన ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయి. బయట బంగారు రంగులో మెరుస్తున్నా.. మన ఆరోగ్యాన్ని పాడు చేసే గుణాలు వాటిలో ఉంటాయి.

చాలా మంది వ్యాపారులు పండ్లు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ అనే డేంజర్ కెమికల్‌ను వాడుతున్నారు. ఈ కెమికల్‌ తో పండిన మామిడి పండ్లు తింటే మన కడుపు మీద ఎఫెక్ట్ చూపి ఆరోగ్యం పాడవుతుంది. కడుపు నొప్పి, వాంతులు, దద్దుర్లు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బయటకు మెరిసిపోతూ చూడటానికి చాలా బాగుండటంతో మనం మోసపోవడం చాలా సులువు. నాచురల్‌గా పండిన మామిడి పండ్లకు తియ్యటి వాసన వస్తుంది. కానీ కెమికల్స్‌తో పండించిన వాటికి అలాంటి వాసన ఉండదు. అలా వాసన లేకపోతే అవి నాచురల్‌ గా పండలేదని గుర్తుంచుకోవాలి.

ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే నేరుగా రైతుల దగ్గర నుంచి పండ్లు కొనడం మంచిది. రైతు బజార్లలో, ఊర్లలో అమ్మే నాచురల్ పండ్లే మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అవి కెమికల్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో పండిస్తారు.

మామిడి పండ్లు నాచురల్‌గా పండాలంటే వరిగడ్డి లేదా తాటి చెక్కల మీద పెట్టి వాటి వేడితో పండిస్తారు. ఇలా పండిన వాటిలో నాచురల్ రుచి, వాసన ఉంటాయి. అలాంటి పండ్లు తింటే మన శరీరానికి ఎలాంటి నష్టం జరగదు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మామిడి పండ్లు ఇంటికి తెచ్చిన వెంటనే తినకూడదు. కనీసం రెండు రోజులు మంచి నీటిలో వేయాలి. అలా చేస్తే వాటి మీద ఉన్న కెమికల్స్ పోతాయి. ఆ తర్వాత తింటే ప్రమాదాలు తగ్గుతాయి.

గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించి పండ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడగానే బాగున్నాయని కొనకుండా నాచురల్ పద్ధతిలో పండిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.

మామిడి పండు నిజంగా మన ఆరోగ్యానికి మంచిదే. కానీ అది నాచురల్‌ గా పండితేనే. కెమికల్స్‌ తో తొందరగా పండించిన పండ్లు తింటే మన ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఆలోచించి జాగ్రత్తగా కొనుక్కొని, నాచురల్‌ గా పండిన పండ్లనే తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!