Diabetes Control: డయాబెటిస్ ను ఈజీగా కంట్రోల్ చేసే సీక్రెట్స్ ఇవే..!

డయాబెటిస్‌ ను అదుపులో ఉంచుకోవడానికి 9 సులభమైన మార్గాలు ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణకు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. మీ రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్‌ ను అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Diabetes Control: డయాబెటిస్ ను ఈజీగా కంట్రోల్ చేసే సీక్రెట్స్ ఇవే..!
Diabetes

Updated on: May 30, 2025 | 6:10 PM

రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం ఇన్సులిన్‌ ను బాగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. నడవడం వల్ల బరువు కూడా తగ్గి డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. ఒత్తిడి వల్ల షుగర్ లెవెల్స్ పెరగొచ్చు. ధ్యానం, డీప్ బ్రీతింగ్ లాంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న తృణధాన్యాలు (రాగులు, జొన్నలు), కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. ఇవి రక్తంలో చక్కెరను నిదానంగా పెంచుతాయి.

నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను కాపాడతాయి. ఇది జీవక్రియను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగడం మంచిది.

దాల్చినచెక్కను నీటిలో మరిగించి తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఇన్సులిన్‌ కు శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

ప్యాకెట్ స్నాక్స్, బేకరీ ఐటమ్స్, ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారాల్లో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచుతాయి. వీటికి పూర్తిగా దూరంగా ఉండండి.

రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది షుగర్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. మంచి నిద్ర వల్ల ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మీ రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా పరీక్షించుకోవడం ముఖ్యం. ఏ ఆహారం అయినా సరే తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్స్ ఎలా మారుతున్నాయో తెలుసుకోవడం వల్ల మీ ఆహార ప్రణాళికను మార్చుకోవచ్చు. ఏమైనా తేడాలు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ ను సంప్రదించండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)