శరీరంలో ఇలాంటి లక్షణాలుంటే ప్రాణానికే ప్రమాదం.. జాగ్రత్త! కామెర్లకు చక్కని హోం రెమెడీస్..

ఎండాకాలం మొదలయ్యే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్దలు, పిల్లలను వేధించే సమస్యల్లో కామెర్లు (జాండీస్) ఒకటి. కామెర్లు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి.

శరీరంలో ఇలాంటి లక్షణాలుంటే ప్రాణానికే ప్రమాదం.. జాగ్రత్త! కామెర్లకు చక్కని హోం రెమెడీస్..
Jaundice

Updated on: Mar 23, 2024 | 2:14 PM

ఎండాకాలం మొదలయ్యే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్దలు, పిల్లలను వేధించే సమస్యల్లో కామెర్లు (జాండీస్) ఒకటి.. కామెర్లు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అయితే, వ్యాధి ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం అశ్రద్ధ చూపినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే త్వరగా నయం చేసుకోవచ్చు..

వాస్తవానికి కామెర్లు ఉన్న వ్యక్తి శరీరం పూర్తిగా రంగు మారిపోతుంది. లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఆరోగ్య సమస్య కనిపిస్తుంది. జ్వరం, చలి, తలనొప్పి, అలసట, నీరసం, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, పసుపు రంగు మూత్రం, కళ్ళు, చర్మం, గోళ్ల రంగులో మార్పులు ఈ వ్యాధి లక్షణాలు.

జాండీస్ ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి కళ్ళు పసుపు రంగులోకి మారడంతోపాటు అతని ముఖం పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే కామెర్లు రావడం ఖాయం. ఈ వ్యాధికి ఆహారంలో మార్పులతో  పాటు మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ముప్పు తప్పదంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కామెర్ల నివారణకు హోం రెమెడీస్..

కామెర్లు ఉన్న వ్యాధిగ్రస్తులు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిలో కొద్దిగా బార్లీని వేసి బాగా మరిగించి క్రమం తప్పకుండా తీసుకోవాలి.

శరీరంలో తగినంత నీరు ఉండేలా ఎప్పటికప్పుడు నిమ్మరసం, పుచ్చకాయ రసం తీసుకోవాలి.

నల్ల జీలకర్ర కషాయాలను తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

జాండీస్ తో బాధపడే వారు వేప రసాన్ని సేవించడం మేలు చేస్తుంది.

కొబ్బరి నీళ్లతో తయారు చేసిన వెనిగర్ తీసుకోవడం వల్ల మంట తగ్గుతుంది. ఇది కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒక గ్లాసు చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఫలితం ఉంటుంది.

చెరుకు రసం రోజుకు రెండుసార్లు తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయి.

కామెర్ల నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటే, ఆహారంలో 3-4 వెల్లుల్లి రెబ్బలను చేర్చుకోండి.. దీనిద్వారా త్వరలోనే ప్రయోజనాలను చూడవచ్చు.

జామకాయ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కామెర్లు నయమవుతాయి.

కాఫీ, గ్రీన్ టీ మితమైన వినియోగం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధిని నయం చేస్తుంది.

టొమాటో రసాన్ని ఉప్పు, పంచదార కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటే కామెర్లు త్వరగా నయమవుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..