Headache: తలనొప్పి సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా..? ఈ చిట్కాలతో సింపుల్‌గా చెక్ పెట్టొచ్చు..

|

Oct 26, 2022 | 9:59 AM

ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలామంది ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. తలనొప్పి తరచూ వస్తుంటే.. ఎక్కువగా ఆందోళన కూడా మొదలవుతుంది.

Headache: తలనొప్పి సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా..? ఈ చిట్కాలతో సింపుల్‌గా చెక్ పెట్టొచ్చు..
Headache
Follow us on

ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలామంది ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. తలనొప్పి తరచూ వస్తుంటే.. ఎక్కువగా ఆందోళన కూడా మొదలవుతుంది. తరచూ తలనొప్పి రావడం వల్ల.. పని కూడా ప్రభావితమవుతుంది. ఒక్కోసారి ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కొందరికి మైగ్రేన్ నొప్పి వస్తుంది. ఈ సమయంలో తలలో చాలా నొప్పి ఉంటుంది. పరిమితికి మించి తలనొప్పి పెరిగితే.. చాలామంది ఇంగ్లీషు మందులనే ఆశ్రయిస్తున్నారు. తలనొప్పికి నిద్రలేమి, డీహైడ్రేషన్, ఆల్కహాల్, ఒత్తిడి మొదలైన అనేక కారణాలున్నాయి. సహాజమైన పద్దతులతో తలనొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు. వీటిని రెగ్యులర్‌గా పాటించడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం..

నీరు ఎక్కువగా తాగండి

శరీరంలో నీరు లేకపోవడం వల్ల చాలా సార్లు తలనొప్పి వస్తుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. మీ ఆహారంలో నీరు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం మంచిది.

యోగాతో విశ్రాంతి

యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ సమస్య నుంచి కూడా సులభంగా బయటపడొచ్చు. కావున మీకు కూడా తలనొప్పి సమస్య ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.

ఇవి కూడా చదవండి

అల్లం తినండి

అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుందని ఒక పరిశోధనలో తేలింది. తలనొప్పి విషయంలో అల్లం టీ తాగవచ్చు. ఇది నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

హాయిగా నిద్రపోండి

తలనొప్పి సమస్యకు నిద్ర కూడా ఓ కారణం. కావున రోజుకు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవడం చాలామంచిది. దీని ద్వారా కూడా తలనొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..