అంజీర పండ్లను ఎవరు తినకూడదు..? అంజీర పండ్లను ఎక్కువగా తింటే ఏమవుతుంది..?

అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అంజీర పండ్లను సమతుల్య పరిమాణంలో తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

అంజీర పండ్లను ఎవరు తినకూడదు..? అంజీర పండ్లను ఎక్కువగా తింటే ఏమవుతుంది..?
Figs Benefits

Updated on: Jan 27, 2025 | 9:17 PM

అంజీర పండ్లలో అధికంగా పోషకాలతో పాటు, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ బలంగా ఉండటానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు అంజీర గింజలు మలబద్ధక సమస్యను దూరం చేసేందుకు సహాయపడతాయి. అలాగే అంజీర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఆహారంలో సమతుల్యత పాటించడం ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి చాలా అవసరం.

ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర పండ్లు శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు చాలా సహాయపడుతుంది. అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరించడంలో అనేక విధాలుగా సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంజీర పండ్లు శరీరంలో క్యాన్సర్ ప్రత్తులను తగ్గించడానికి కూడా సహాయపడవచ్చు. ముఖ్యంగా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రేడికల్స్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

రోజుకు ఎన్ని తినాలి..?

ప్రతి వ్యక్తి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా అంజీర పండ్ల పరిమాణం వేరుగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా రోజుకు 2-3 అంజీర పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ పరిమాణం సాంకేతికంగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. కానీ డైట్ ఫాలో అయ్యే వారు మాత్రం తమ వైద్యులను లేదా డైటిషన్ ను అడిగి తీసుకోవడం మంచిది.

ఎవరు తినకూడదు..?

అంజీర పండ్లలో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఇలాంటి అధిక కేలరీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. పాలిచ్చే మహిళలకు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అంజీర పండ్లలో అధిక చక్కెర ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తినడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తులకు అంజీర పండ్లతో అలెర్జీ ఉండవచ్చు. అలాంటివారు అంజీర పండ్లను తీసుకోవడం ముందే వైద్యులను సంప్రదించడం మంచిది.

జీర్ణవ్యవస్థకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తినడం వలన నష్టం జరగవచ్చు. ఎందుకంటే ఈ పండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు. అంజీర పండ్లలో ఎక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు ఇవి తినకూడదు. అంజీరలో అధిక పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తీసుకోవడం వలన హానికరంగా ఉంటుంది.

గుండె జబ్బుతో బాధపడుతున్న వారు కూడా ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక పొటాషియం ఉంటుంది. ఇది గుండెపై ప్రభావం చూపవచ్చు. అంజీర పండ్లు మంచి పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని సరిగ్గా సమతుల్య పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)