AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు రాలడం తగ్గాలంటే ఇలా చేయండి.. గ్యారెంటీగా మంచి రిజల్ట్ ఉంటుంది..!

ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. ముఖ్యంగా స్నానం తర్వాత అధికంగా జుట్టు రాలిపోతుంటే.. నీటి లోపమే కారణం కావచ్చు. ఇంట్లో వాడే హార్డ్ వాటర్ వల్ల జుట్టు తేమ కోల్పోయి పొడిబారిపోతుంది. సరైన ఆహారం, శ్రద్ధతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

జుట్టు రాలడం తగ్గాలంటే ఇలా చేయండి.. గ్యారెంటీగా మంచి రిజల్ట్ ఉంటుంది..!
Healthy Hair
Follow us
Prashanthi V

|

Updated on: May 11, 2025 | 2:23 PM

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి జుట్టు రాలిపోవడం. స్నానం చేసిన తరువాత ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే.. కారణాలు చాలానే ఉండొచ్చు. పోషకాహారం లోపం, ఆరోగ్య సమస్యలతో పాటు, ఇంట్లో ఉపయోగించే నీటి ప్రభావం కూడా ఉండొచ్చు.

మీ ఇంట్లోని కుళాయి నుండి వచ్చే నీటిలో మెగ్నీషియం లేదా కాల్షియం అధికంగా ఉంటే ఆ నీటిని హార్డ్ వాటర్ అంటారు. ఈ రకమైన నీటితో జుట్టు కడగడం వల్ల జుట్టు పొడిగా, జీవనరహితంగా మారుతుంది. ఇలా రోజూ జరిగితే జుట్టుకు తీవ్ర నష్టమవుతుంది. కాబట్టి మీరు వాడే నీటి స్వభావాన్ని గమనించి మార్పులు చేయాలి.

నీటిలో ఖనిజాల పరిమాణం ఎక్కువగా ఉంటే జుట్టులో తేమ తగ్గిపోతుంది. తేమ లేకపోతే జుట్టు పొడిబారుతుంది. దాంతో పాటు కొంచెం కొంచెంగా రాలిపోవడం మొదలవుతుంది. మీ ఇంట్లో ట్యాప్‌ లోకి వచ్చే నీటికి ప్రత్యేకమైన ఫిల్టర్ అమర్చితే ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది.

ప్రతి రోజు తలస్నానం జుట్టుకి అస్సలు మంచిది కాదు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల జుట్టు మూలాల దగ్గర నుంచే బలహీనమవుతుంది. దీంతో జుట్టు తేలికగా రాలిపోతుంది. వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు మాత్రమే షాంపూతో శుభ్రం చేయడం మంచిది.

ఎక్కువ వేడినిచ్చే హెయిర్ డ్రయర్లు, స్ట్రెయిటనర్లు వాడితే జుట్టులోని ప్రోటీన్ పాడైపోతుంది. దానివల్ల జుట్టు చివర్లు చీలిపోతాయి. జుట్టు బలంగా ఉండాలంటే వాటిని ఎక్కువగా వాడకూడదు. జుట్టును సహజంగా ఆరబెట్టుకోవడం మంచిది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం కీలకం. డైట్‌లో జింక్, బయోటిన్, ఐరన్, విటమిన్ సి లాంటి పదార్థాలు ఉండాలి. ఇవి జుట్టు వృద్ధికి సహాయపడతాయి. ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, తినడం ద్వారా ఈ పోషకాలు లభిస్తాయి.

జుట్టు రాలడం పూర్తిగా తగ్గాలంటే చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవాలి. మంచి నీళ్లు తాగడం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, వేడి చేసే వాటిని తగ్గించడం లాంటివి చేస్తే జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. సహజంగా జుట్టును కాపాడుకుంటేనే అది ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
IPL 2025లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్లు వీరే.. లిస్ట్‌లో మనోళ్లు
IPL 2025లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్లు వీరే.. లిస్ట్‌లో మనోళ్లు
వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది.. కానీ
వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది.. కానీ
జాతకంలో గురు పుష్య యోగం ఎప్పుడు? ఎలా ఏర్పడుతుంది?
జాతకంలో గురు పుష్య యోగం ఎప్పుడు? ఎలా ఏర్పడుతుంది?
టీమిండియా పాలిట విలన్‌లా మారనున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్
టీమిండియా పాలిట విలన్‌లా మారనున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్
ఢిల్లీ ఈ ప్రసిద్ధ శని దేవాలయాలను సందర్శించండి.. ఆనందం మీ సొంతం
ఢిల్లీ ఈ ప్రసిద్ధ శని దేవాలయాలను సందర్శించండి.. ఆనందం మీ సొంతం
థియేటర్స్ బంద్ వెనకాల కుట్ర.. ఆ నలుగురే కారణం
థియేటర్స్ బంద్ వెనకాల కుట్ర.. ఆ నలుగురే కారణం
ఆర్‌సీబీ ఓటమితో కోహ్లీకి దిమ్మ తిరిగే షాక్.. ఆ లిస్ట్ నుంచి ఔట్..
ఆర్‌సీబీ ఓటమితో కోహ్లీకి దిమ్మ తిరిగే షాక్.. ఆ లిస్ట్ నుంచి ఔట్..
ఈ రోజు రావి చెట్టుని ఇలా పూజించండి.. శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం
ఈ రోజు రావి చెట్టుని ఇలా పూజించండి.. శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం