Diabetes: డయాబెటిస్ వచ్చినట్లు ఎలా నిర్ధరించుకోవాలి..? లక్షణాలు ఇలా ఉంటాయి?

|

May 29, 2022 | 6:14 PM

డయాబెటిస్‌ రావడానికి ఫ్యామిలీ హిస్టరీకి లైఫ్ స్టైల్ అలవాట్లు తోడైనప్పుడు ఇది వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. మధుమేహం వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం పొరపాటు.. యువతీ యువకులలో..

Diabetes: డయాబెటిస్ వచ్చినట్లు ఎలా నిర్ధరించుకోవాలి..? లక్షణాలు ఇలా ఉంటాయి?
Diabetes
Follow us on

ఉరుకుల పరుగుల జీవితం.. మారిన జీవన శైలి కారణంగా డయాబిటిస్(diabetes) బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనికి తోడు అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలని డయాబెటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. అధిక పని గంటలు, వివిధ షిఫ్టులలో పని చేయడం కూడా ఒత్తిడికి దారి తీస్తాయని అంటున్నారు. డయాబెటిస్‌ రావడానికి ఫ్యామిలీ హిస్టరీకి లైఫ్ స్టైల్ అలవాట్లు తోడైనప్పుడు ఇది వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. మధుమేహం వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం పొరపాటు.. యువతీ యువకులలో డయాబెటిస్ కనిపించడం 2K సంవత్సరం నుంచీ ఎక్కువయిందని వైద్యులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 మందిలో కనీసం ఒకరికి మధుమేహం ఉంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50.37 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

అయితే భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లుగా అంచనా వేసింది. ఈ సంఖ్య 2045 నాటికి 13.4 కోట్లకు చేరుతుందని అంచనా. భారతదేశంలో 25 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి అడల్ట్ ఆన్‌సెట్ టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) యూత్ డయాబెటిస్ రిజిస్ట్రీ చెబుతోంది. అయితే.. డయాబెటిస్ వచ్చిందని తెలిసిన తర్వాత డైట్ అలవాట్లను మార్చుకున్నారా లేదా అని ప్రశ్చించినా..? అలాంటి లేదు అని సమాధనం వస్తోంది.

దీనికి ఓ కారణం చెబుతుంటారు.. తమకు ప్రత్యేకంగా తయారు చేయాలి.. అందుకే వాటిని తాము ఒదిలిపెట్టామూ అని.. డయాబిటిస్ వచ్చినటువంటివారు మరో ప్రశ్నకూడా వేస్తుంటారు. మందులు వేసుకుంటున్నంత తగ్గుతుందా..? అని. అయితే.. మందులు వేసుకుంటున్నంత మాత్రాన ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకోకపోతే, డయాబెటిస్ నియంత్రణ కష్టమేనంటారు వైద్య నిపుణులు.

డయాబెటిస్ వచ్చినట్లు ఎలా నిర్ధరించుకోవాలి..?

శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఫాస్టింగ్‌లో అంటే పొద్దున ఎలాంటి ఆహారం తీసుకోకముందు 70 – 100 రేంజ్‌లో ఉంటే అది సాధారణ స్థాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్ధారించింది. ఈ రేంజ్ 100 – 125 మిల్లీగ్రాములకు చేరితే.. ప్రీ డయాబెటిస్ అని.. అదే 126 ఆ పైన ఉంటే మధుమేహం ఉన్నట్లని సూచిస్తోంది. అయితే తాజాగా కొందరు వైద్యుల చెబుతున్నవాటిపై కొంత వివాదం కూడా ఉంది. ఫార్మా కంపెనీలు లాభాల కోసం ఈ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నారని కొంత మంది నిపుణులు ఆరోపిస్తున్నారు.

డయాబెటిస్ లక్షణాలు ఇలా ఉంటాయి?

అధికంగా దాహం వేయడం, రాత్రి పూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవడం, విపరీతమైన అలసట , ఎటువంటి ప్రయత్నమూ లేకుండానే బరువు కోల్పోవడం, కంటి చూపు మందగింపు, గాయాలు మానకపోవడం డయాబెటిస్ లక్షణాలని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంటోంది. అయితే, లక్షణాలేవీ కనిపించకుండా కూడా డయాబెటిస్ రావచ్చని డాక్టర్లు అంటారు.