Home Made Health Tips: శ్వాసకోశ వ్యాధులు, నోటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా ఈ చిన్ని చిట్కాలు పాటించి చూడండి

|

Jul 06, 2021 | 5:58 PM

Home Made Health Tips: పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్న సామెతను నిజం చేస్తూ.. మన పురాతన వైద్యం ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం.. అయితే వైద్య రంగంలో ఎన్నో ..

Home Made Health Tips: శ్వాసకోశ వ్యాధులు, నోటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా ఈ చిన్ని చిట్కాలు పాటించి చూడండి
Ayurvedic Tips
Follow us on

Home Made Health Tips: పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్న సామెతను నిజం చేస్తూ.. మన పురాతన వైద్యం ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం.. అయితే వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న వైద్యం . ఆయుర్వేదంతో వ్యాధి తగ్గడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో లభించే వాటితోటే కావాల్సిన వైద్యం చేసుకోవచ్చు.ఒత్తిళ్ళతో కూడిన ఆధునిక జీవితం మనిషి అనారోగ్యానికి కారణమవుతోంది. అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వైద్యుని దగ్గరకు వెళ్లడం ఆర్ధికంగానే కాదు శారీరకంగా అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. కనుక ఇంట్లోనే వైద్యం చేసుకునే ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటించండి.. వ్యాధులనుంచి విముక్తి పొందండి.

శ్వాసకోశ వ్యాధుల నివారణకు చిట్కాలు:

*జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.
*మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
*అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.
*సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.

నోటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే నివారణకు చిట్కాలు :

*లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
*వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి.
*పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
*నోటి పూతను నివారణ కోసం సులభమైన చిట్కా.. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
*లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.
*గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.

Also Read: గుమ్మడికాయ తినం అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారా.. సీజనల్ వ్యాధుల నుంచి అది ఇచ్చే రక్షణ గురించి తెలిస్తే..