Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? శరీరంలో కొవ్వు మోతాదుకు మించి ఉన్నట్లే

|

Aug 13, 2022 | 9:18 PM

Health Care Tips: శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణం. శరీరంలో మంచి, చెడు అని రెండు రకాల కొలెస్ట్రాల్‌ ఉంటుంది.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? శరీరంలో కొవ్వు మోతాదుకు మించి ఉన్నట్లే
Cholesterol
Follow us on

Health Care Tips: శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణం. శరీరంలో మంచి, చెడు అని రెండు రకాల కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అయితే శరీరంలో ఏ కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినా అందుకు మన జీవనశైలి, ఆహారం మొదలైనవి కారణాలవుతాయి. రక్తంలో ఎల్‌డీఎల్ కొవ్వు అధికంగా ఉంటే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే. LDL కొలెస్ట్రాల్‌ను తరచుగా చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ధమనులను అడ్డుకుంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దురదృష్టవశాత్తు ఇది త్వరగా బయటపడదు. కొలెస్ట్రాల్ సహజంగా శరీరానికి హానికరం కాదు. అయితే మోతాదుకు మించి కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినా, తగ్గినా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండెపోటు, స్ట్రోక్‌తో సహా గుండె జబ్బులకు అధిక కొలెస్ట్రాల్ ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2.6 మిలియన్ల మరణాలకు ఇదే కారణమట. ఆహారంలో తక్కువ కొవ్వు తీసుకోవడం కొలెస్ట్రాల్ నిర్వహణలో సహాయపడుతుంది. మాంసం, చీజ్, పాల ఉత్పత్తులు, చాక్లెట్, వేయించిన ఆహారాలు,ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి ఆహారాలను చాలా పరిమితంగా తీసుకోవాలి. కాగా అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా అరుదుగా లక్షణాలను కలిగిస్తుంది. నడిచేటప్పుడు లేదా ఏదైనా ఇతర శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ప్రజలు నొప్పిని అనుభవిస్తారు. ఈ సంక్లిష్టత కాళ్లు తదితర అవయవాలు ఉబ్బడానికి కారణమవుతుంది. అదేవిధంగా తరచూ తిమ్మిర్లు కలుగుతుంటాయి. అదేవిధంగా కాళ్లు తదితర భాగాల్లో దుర్వాసనతో కలిగిన చీము పడుతుంది. దీనివల్ల తీవ్ర నొప్పి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇతర లక్షణాలు

  • పాదాలలో తీవ్రమైన మంట నొప్పి. విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గదు
  • మీ చర్మం లేతగా, మెరుస్తూ, మృదువుగా, పొడిగా మారుతుంది
  • కాళ్లపై మానని గాయాలు మరియు పుండ్లు
  • వైద్యుల సలహాలు, సూచనలతో పాటు వయస్సు, బరువు, ఇతర అంతర్లీన పరిస్థితుల ఆధారంగా పరీక్షలు, మందులు తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..