Blood Pressure Control Tips: ప్రస్తుత కాలంలో చాలామంది బ్లడ్ ప్రెజర్ ( బీపీ ) సమస్యతో బాధపడుతున్నారు. ఈ రక్తపోటు సమస్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిలో కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. BP పెరుగుదల ఆరోగ్యానికి అస్సలు ప్రయోజనకరం కాదని.. ఇది క్రమంగా గుండెపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. అయితే.. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ సమస్య జఠిలమైన కొంతమంది జీవితాంతం బీపీ మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో.. మందులు వేసుకోకుండా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు మందులు తినవలసిన అవసరం ఉండదని.. దీంతోపాటు రక్తపోటును సులభంగా నియంత్రణలో ఉంచుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
రోజూ వ్యాయామం చేయండి
కొంతమంది వ్యాయామం చేయరు.. దీని కారణంగా మీ శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. బీపీ సమస్యతో బాధపడే వారు రోజూ వ్యాయామం చేయాలి. దీంతో పెరిగిన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా.. యోగా లేదా ధ్యానం లాంటివి చేయడం కూడా మంచిది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
డైట్ మెరుగుపరచాలి..
బీపీ సమస్యతో బాధపడే వారు తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టాలి. ఇది కూడా మీ బీపీని అదుపులో ఉంచుతుంది. అధిక సోడియం ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. ఎక్కువగా ఆకుకూరలను తినడానికి ప్రయత్నించండి.
ధూమపానం – మద్యపానానికి దూరంగా ఉండండి
ధూమపానం – మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇది బీపీ సమస్యను కూడా పెంచుతుంది. వాస్తవానికి దీనివల్ల హైబీపీ సమస్య పెరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఈ రెండింటికి దూరంగా ఉండటం మంచిది.
ఒత్తిడికి దూరంగా ఉండండి.. ఎప్పటికప్పుడు చెకప్‌లు చేయించుకోండి..
ఒత్తిడి కారణంగా చాలా సమస్యలు మొదలవుతాయి. కాబట్టి యోగా చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండండి. అలాగే బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. తద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బీపీని నియంత్రించవచ్చు.
Also Read: