Hepatitis Disease: ప్రతియేటా పెరుగుతున్న హెపటైటీస్‌ వ్యాధిగ్రస్థులు.. దీని లక్షణాలు ఏమిటి..?

Hepatitis Disease: ఇప్పుడున్న కాలంలో అందరి జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల వివిధ..

Hepatitis Disease: ప్రతియేటా పెరుగుతున్న హెపటైటీస్‌ వ్యాధిగ్రస్థులు.. దీని లక్షణాలు ఏమిటి..?
Hepatitis Disease
Subhash Goud

|

Sep 22, 2022 | 7:10 AM

Hepatitis Disease: ఇప్పుడున్న కాలంలో అందరి జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక వెంటాడుతున్న వ్యాధుల్లో హెపటైటీస్ వ్యాధి ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని కాలేయం (లివర్‌)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈహెపటైటీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి తీవ్రత సిర్రోలిక్ దశకు చేరుకుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశలోకాలేయం మార్పిడి చేయాల్సి వస్తుంది. అందుకు వ్యాధి బారినపడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.

  1. ప్రతియేటా పెరుగుతున్న వ్యాధిగ్రస్థులు: దేశ వ్యాప్తంగా ప్రతియేటా హెపటైటీస్ వ్యాధిగ్రస్థులు పెరిగిపోతున్నారు. పలు ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణం, కలుషితమైన నీటి కారణంగా ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధికంగా మురికివాడల్లోనూ ఈ హెపటైటీస్ -బి నమోదవుతోంది. ఈ వ్యాధి పై అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం వైద్య ఆరోగ్యశాఖపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
  2. ప్రాథమిక దశలోని చికిత్స అందించాలి: ప్రాథమిక దశలోనే ఈ వ్యాధికి చికిత్స అందిస్తే ప్రాణాల నుంచి గట్టెక్కవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకా కూడా అందుబాటులో ఉంది. దీని ధర కూడా మార్కెట్లో అధిక ధర ఉండటంతో పేదలకు ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. దీనిని దృష్టి ఉంచుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.
  3. ఈ వ్యాధి ఎవరికి ఎక్కువ వస్తుంది?: ఈ వ్యాధి అధికంగా మద్యం సేవించే వారికి వస్తున్నట్లు తెలుస్తోంది. శరీరంలో చేరే మద్యాన్ని విసర్జించే క్రమంలో కాలేయం ఎక్కువగా శ్రమకు గురవుతుంది. కాలేయం సామర్థ్యానికి మించి మద్యం సేవించినట్లయితే కాలేయ క్రమ క్రమంగా కాలేయం దెబ్బతిని ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్‌, ఆల్కహాలిక్ హెపటైటీస్ ఆల్కహాలిక్ సిర్రోసిస్ వ్యాధులు దరిచేరుతాయి. ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్‌లో కాలేయం కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే కాలేయం పనితీరు సక్రమంగా ఉన్నా.. ఎంజైమ్ విడుదలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. అతిగా మద్యం సేవించే వారి కాలేయం వాపునకు గురై గట్టిగా తయారవుతుంది. దీనినే ఆల్కహాలిక్ హెపటైటీస్ అంటారు.

వ్యాధి లక్షణాలు:

☛ కామెర్లు, రక్తం వాంతులు

☛ విరోచనాలు, అలసట ఎక్కువగా ఉండటం

☛ ఆకలి లేకపోవడం

☛ కడుపు నొప్పి

☛ క్రమ క్రమంగా బరువు తగ్గిపోవడం

☛ కండరాలు, కీళ్ల నొప్పులు అధికంగా ఉండటం

☛ జ్వరం

☛ కాళ్లు, పొట్టవాపు

☛ చర్మం, కళ్లు పచ్చగా మారడం

☛ నల్లరంగులో విరోచనాలు

☛ పగలు నిద్ర, రాత్రుల్లో మెలకువగా ఉండట

చికిత్స

☛ వ్యాధి నివారణకు శాశ్వత చికిత్స లేదు

☛ వ్యాధిగ్రస్థుడు ప్రతియేటా వైద్య పరక్షలు చేయించుకోవాలి

☛ హెపటైటీస్ టీకా వేయించుకోవాలి.

☛ వారానికి ఒక ఇంట్రఫిరాన్ ఇంజక్షన్ వేసుకోవాలి.

☛ అతి ఖర్చుతో కూడినది కారణంగా మాత్రల ద్వారా నియంత్రణ చేయవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu