Heat Stroke: వేసవిలో హీట్‌ స్ట్రోక్‌ నుంచి పిల్లలను రక్షించడానికి ఈ చిట్కాలను అనుసరించండి

|

Apr 13, 2022 | 7:41 AM

Heat Stroke: వేసవి (Summer) కాలం మొదలైంది. మండుతున్న ఎండలో వేడి గాలి కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. హీట్ స్ట్రోక్ వల్ల శరీరంలో నీరు..

Heat Stroke: వేసవిలో హీట్‌ స్ట్రోక్‌ నుంచి పిల్లలను రక్షించడానికి ఈ చిట్కాలను అనుసరించండి
Follow us on

Heat Stroke: వేసవి (Summer) కాలం మొదలైంది. మండుతున్న ఎండలో వేడి గాలి కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. హీట్ స్ట్రోక్ వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో అలసట, బద్ధకం ప్రారంభమవుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు హీట్ స్ట్రోక్‌కు ఎక్కువగా గురవుతారు. దీనివల్ల పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతారు. అటువంటి పరిస్థితిలో పిల్లలు (హీట్ స్ట్రోక్ ) మండే వేడిలో చల్లని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు హీట్ స్ట్రోక్ మొదలైన వాటిని నివారించడానికి సత్తు, మజ్జిగ, నిమ్మరసం మొదలైనవి తినవచ్చు. పిల్లల డైట్‌లో ఏ ఇతర ఆహారాలు చేర్చవచ్చో తెలుసుకుందాం.

బార్లీ:

బ్లార్లీ నీటిని తాగడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీని వల్ల పిల్లలకు హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బార్లీతో చేసిన పానీయాలను తీసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, క్యాల్షియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.

పుచ్చకాయ:

పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని డీహైడ్రేట్‌గా ఉంచడానికి ఇది పనిచేస్తుంది. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.

మజ్జిగ:

పెరుగును ఉపయోగించి మజ్జిగ తయారు చేస్తారు. అందులో నీరు, ఉప్పు కలుపుతారు. మజ్జిగ వల్ల పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ సాంప్రదాయ పానీయం శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం చక్కెర, ఉప్పు, నీటిని ఉపయోగించి తయారు చేస్తారు. నిమ్మకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.

మామిడి రసం:

మామిడిలో దాదాపు 80 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో తినే ప్రసిద్ధ పండు. మామిడిని పండ్లలో రారాజు అని కూడా అంటారు. దాదాపు అన్ని వయసుల వారు దీన్ని ఇష్టపడతారు. మీరు మీ పిల్లలకు మ్యాంగో షేక్ తయారు చేసి ఇవ్వవచ్చు.

టమాటో రసం:

ప్రతిరోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీని వినియోగం హీట్ స్ట్రోక్ సమస్య నుండి మిమ్మల్ని రక్షించడానికి పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి:

Pregnancy Care: ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి ఉద్యోగం చేసే మహిళ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి

Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్‌ లోపమే..!