Heart Health: ఉరుకుపరుగుల జీవితం.. ఆధునిక జీవనశైలి, అసమతుల్య ఆహారం కారణంగా పలు రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. నేటి కాలంలో గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఆహారం, జీవనశైలే అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వంటి అనేక తీవ్రమైన సమస్యలు ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తున్నాయి. గుండె సమస్యలున్న రోగికి గుండెలో నొప్పి, అసౌకర్యం, ఛాతీ, ఛాతీ నొప్పి, మెడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు శరీరం మరెన్నో సంకేతాలు ఇస్తుందన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నొప్పి (abdominal pain) గుండెపోటుకు సంకేతం ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకోండి..
గుండెపోటుకు దారితీసే సంకేతాలు..
కడుపు నొప్పి: సాధారణంగా గుండెపోటు లేదా గుండె సమస్యలు రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. దీని కారణంగా మీ గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి గుండెపోటు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి, అసౌకర్యం లాంటి సమస్యలు ఉండవచ్చు. కానీ చాలా సార్లు ఈ సమస్య సమయంలో రోగులలో తీవ్రమైన కడుపునొప్పి సమస్య కూడా కనిపిస్తుంది. కడుపు నొప్పి సమస్య కూడా గుండెపోటు లక్షణం కావచ్చు. గుండెకు సరైన విధంగా రక్త సరఫరా లేనప్పుడు దీని కారణంగా మీ శరీరంలో రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో కడుపునొప్పి వస్తుంది. అందుకే కడుపు నొప్పి సమస్యను తేలికగా తీసుకోకండి.
అజీర్ణం – కడుపు ఉబ్బరం: గుండెపోటుకు ముందు అజీర్ణం, తేపులు కూడా దీని సంకేతాలుగా పరిగణిస్తారు. తరచుగా అజీర్ణం, త్రేనుపు సమస్యలు గుండెపోటు లేదా గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి మీరు కూడా అజీర్ణం సమస్యతో బాధపడుతుంటే, వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..