AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

ప్రస్తుత కాలంలో గుండెపోటు యువతను మింగేస్తుంది. గతంలో పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్ ఇప్పుడు పిల్లలను కూడా వదలడం లేదు. పైకి ఎంతో ఫిట్‌గా కనిపించే వారి గుండెలు కూడా ఎందుకు హఠాత్తుగా ఆగిపోతున్నాయి? దీనికి కరోనా వ్యాక్సిన్లే కారణమా? లేక మనకు తెలియకుండానే ఏదైనా సైలెంట్ కిల్లర్ మన ప్రాణాలను తీస్తుందా? అనేది తెలుసుకుందాం..

Heart Health: యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
Why Are Young People Getting Heart Attacks
Krishna S
|

Updated on: Jul 12, 2026 | 12:47 PM

Share

ఒకప్పుడు గుండెపోటు అంటే కేవలం వృద్ధులకు, యాభై ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చేదనే నమ్మకం ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 20, 30, 40 ఏళ్ల వయసులోనే ఆఫీసు డెస్క్‌ల దగ్గర కూర్చుని, జిమ్‌లలో వర్కవుట్లు చేస్తూ లేదా నడుస్తూ నడుస్తూనే గుండె ఆగి కుప్పకూలుతున్న యువకుల వార్తలు రోజూ మనల్ని కలవరపెడుతున్నాయి. పైకి ఎంతో ఫిట్‌గా కనిపించే యువతకు కూడా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తోంది? దీనికి కరోనా వ్యాక్సిన్లే కారణమా? లేక మన జీవనశైలిలోనే లోపం ఉందా? వైద్య నిపుణుల పరిశోధనల్లో తేలిన అసలు నిజాలు ఇవే..

కొరోనరీ ఆర్టరీ డిసీజ్ – ముంచుకొస్తున్న ముప్పు

భారతదేశంలో యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య ప్రీమెచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. జన్యుపరమైన కారణాలు కొందరిలో ఉన్నప్పటికీ.. ఎక్కువ మందిలో జీవనశైలి మార్పులే దీనికి కారణం. పాత తరంతో పోలిస్తే నేటి యువత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. శారీరక శ్రమ శూన్యమైంది. దీనికి తోడు క్యాలరీలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి.

క్రానిక్ స్ట్రెస్

నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ అభద్రత, ఆర్థిక ఇబ్బందులు, సోషల్ మీడియా అంచనాలు యువతను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. నిరంతర ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తపోటును పెంచి, రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అంతేకాదు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. వైద్య శాస్త్రం ఇప్పుడు ఒత్తిడిని గుండెపోటుకు ఒక స్వతంత్ర కారణాంశంగా గుర్తిస్తోంది.

అలవాట్లు – నిద్రలేమి

ధూమపానం గుండెకు అతిపెద్ద శత్రువు. ఇది రక్తనాళాలను దెబ్బతీసి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. అలాగే మితిమీరిన మద్యపానం కూడా గుండె లయను తప్పుతుంతుంది. వీటితో పాటు నైట్ షిఫ్ట్‌లు, మితిమీరిన స్క్రీన్ టైమ్ వల్ల సరైన నిద్ర లేకపోవడం వల్ల మెటబాలిజం దెబ్బతిని గుండె జబ్బులకు దారితీస్తోంది.

కంటికి కనిపించని శత్రువు

నగరాల్లో నివసించే యువత నిత్యం ట్రాఫిక్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. వాహనాల నుంచి వచ్చే హానికరమైన సూక్ష్మ కణాలు శ్వాస ద్వారా రక్తంలోకి చేరి, రక్తనాళాల్లో వాపును కలుగజేసి గుండె జబ్బులను వేగవంతం చేస్తున్నాయి.

కోవిడ్-19 లేదా వ్యాక్సిన్ల వల్లేనా?

కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటులు పెరగడానికి వ్యాక్సిన్లే కారణమనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం.. కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన కొందరిలో రక్తం గడ్డకట్టే గుణం పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, అన్ని గుండెపోటులకు కోవిడ్ లేదా వ్యాక్సిన్లను మాత్రమే బ్లేమ్ చేయడం తప్పు. మధుమేహం, బీపీ, ధూమపానం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి సాంప్రదాయక కారణాలే ఇప్పటికీ 90శాతం గుండెపోటులకు ప్రధాన కారణాలని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి.

ఇది సడన్‌గా వచ్చేది కాదు..

చాలా మంది గుండెపోటు అకస్మాత్తుగా వచ్చిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. మనం చేసే పొరపాట్లు, నిర్లక్ష్యం చేసిన రిస్క్ ఫ్యాక్టర్లు చాలా ఏళ్ల పాటు గుండె రక్తనాళాలను లోపల సైలెంట్‌గా దెబ్బతీస్తూ వస్తాయి. వయసు చిన్నదైనంత మాత్రాన గుండె జబ్బులు రావని గ్యారెంటీ లేదు.

యువత ఇప్పుడైనా ఏం చేయాలి..?

చిన్న చిన్న మార్పులతో గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు..

వ్యాయామం: వారంలో కనీసం 5 రోజులు, రోజుకు 30 నుండి 45 నిమిషాల పాటు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి.

ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

పరీక్షలు: చాలా మంది యువతకు తమకు బీపీ లేదా షుగర్ ఉన్నట్లు హార్ట్ ఎటాక్ వచ్చే వరకు తెలియడం లేదు. కాబట్టి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి.

ప్రశాంతత: ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి.

Follow Us