Heart Attack Risk: ఈ మూడు అలవాట్లు ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం.. ఈ రోజే మీ హ్యాబిట్స్‌ను మార్చుకోండి..

|

Nov 11, 2023 | 12:25 PM

Heart Disease: ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, వేగంగా పెరుగుతున్న వ్యాధులలో ఒకటి గుండెపోటు. సాధారణంగా, గుండె జబ్బులు పెరుగుతున్న వయస్సుతో సంభవించే సమస్యగా పరిగణిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, యువకులు కూడా ఈ తీవ్రమైన వ్యాధికి ఎక్కువగా బాధితులవుతున్నారు.

Heart Attack Risk: ఈ మూడు అలవాట్లు ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం.. ఈ రోజే మీ హ్యాబిట్స్‌ను మార్చుకోండి..
Heart Attack
Follow us on

Heart Disease: ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, వేగంగా పెరుగుతున్న వ్యాధులలో ఒకటి గుండెపోటు. సాధారణంగా, గుండె జబ్బులు పెరుగుతున్న వయస్సుతో సంభవించే సమస్యగా పరిగణిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, యువకులు కూడా ఈ తీవ్రమైన వ్యాధికి ఎక్కువగా బాధితులవుతున్నారు. నటుడు సిద్ధార్థ్ శుక్లా, ప్రముఖ కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్.. గాయకుడు కెకె.. ఇలా ఎందరో… గుండెపోటుతో మరణించారు.

గుండెపోటు ఎందుకు వస్తుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెలో రక్త ప్రసరణ నిరోధించబడినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా నాళాలలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్ధాలు పేరుకుపోవడం వల్ల ఈ రకమైన అడ్డంకులు ఏర్పడతాయి. మనం ప్రతిరోజూ కొన్ని పనులు తెలిసో తెలియకో చేస్తూనే ఉంటాం.. దాని వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. దీని గురించి ప్రజలందరూ తెలుసుకోవడం.. దాని నుంచి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యం. మన అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా, గుండెపోటు ప్రమాదాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.

గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే..

బరువును అదుపులో ఉంచుకోలేకపోవడం

ఈ వేగవంతమైన జీవితంలో చాలా మంది ప్రజలు ఊబకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. గుండెపోటుకు ఇది ప్రమాద కారకాల్లో ఒకటిగా ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఊబకాయం అధిక రక్త కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు మీ బరువును సకాలంలో తగ్గడం మంచిది.

స్మోకింగ్ – టెన్షన్

చాలా అధ్యయనాలు ధూమపానం చేసేవారు.. ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చూపిస్తున్నాయి. నిజానికి, ధూమపానం వల్ల ధమనులలో కాలక్రమేణా ఫలకం ఏర్పడుతుంది. దీని వలన ధమనులు సంకుచితం అయి.. గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా, అధిక ఒత్తిడి కూడా రక్తపోటు సమస్యను పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారకంగా కనిపిస్తుంది. అందుకే స్ట్రెస్ తీసుకోవద్దని, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శారీరక శ్రమ లేకపోవడం

రిలాక్స్‌డ్‌ లైఫ్‌ని ఇష్టపడే అలవాటు వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శారీరక నిష్క్రియాత్మకత గుండె జబ్బుల ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే శరీరం క్రియారహితంగా ఉన్నప్పుడు, ధమనులలో కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. మీ గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు దెబ్బతిన్నట్లయితే లేదా మూసుకుపోయినట్లయితే అది గుండెపోటుకు కారణమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. యోగా, వ్యాయామం లాంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండెపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

గుండెపోటు లక్షణాలు

  • పెరుగుతున్న ఛాతీ నొప్పి
  • చెమటలు పట్టడం
  • ఊపిరి తీసుకోవడం కష్టమవడం- ఊపిరి ఆడకపోవడం
  • వాంతులు, వికారం – తలతిరగడం
  • నీరసం.. ఆకస్మిక అలసట
  • ఛాతీ మధ్యలో కొన్ని నిమిషాల పాటు తీవ్రమైన నొప్పి, భారంగా లేదా పిండినట్లు అనిపించడం
  • భుజాలు , మెడ, చేతులు – దవడ నుంచి గుండె వరకు నొప్పి .. ఇలా ఉంటాయి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..