Depression Precautions: డిప్రెషన్ ను తరిమేసే హెల్దీ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్.. డోంట్ మిస్ ఇట్!!

|

Sep 21, 2023 | 2:14 PM

డిప్రెషన్.. ఇప్పుడు ఎవరిని కదిపినా ఇదే మాట వినిపిస్తోంది. కొంత మంది చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్ కు లోనవుతున్నారు. చివరికి అందులో నుంచి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య స్కూల్ కి వెళ్లే పిల్లలు సైతం డిప్రెషన్ కు లోనై సూసైడ్ లు చేసుకుంటున్నారు. డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు.. కానీ ఈజీగా తీసుకునేంత చిన్న సమస్య కూడా కాదు. స్కూల్ లో చదువుల ఒత్తిడులు, ఉద్యోగాల్లో టెన్షన్స్, ప్రేమలో బ్రేకప్స్, ఆర్థిక ఇబ్బందులు, లైంగిక వేధింపులు, నచ్చిన వ్యక్తి మరణించడం ఇలా అనేక కారణాలతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. అయితే..

Depression Precautions: డిప్రెషన్ ను తరిమేసే హెల్దీ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్.. డోంట్ మిస్ ఇట్!!
Depression
Follow us on

డిప్రెషన్.. ఇప్పుడు ఎవరిని కదిపినా ఇదే మాట వినిపిస్తోంది. కొంత మంది చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్ కు లోనవుతున్నారు. చివరికి అందులో నుంచి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య స్కూల్ కి వెళ్లే పిల్లలు సైతం డిప్రెషన్ కు లోనై సూసైడ్ లు చేసుకుంటున్నారు. డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు.. కానీ ఈజీగా తీసుకునేంత చిన్న సమస్య కూడా కాదు. స్కూల్ లో చదువుల ఒత్తిడులు, ఉద్యోగాల్లో టెన్షన్స్, ప్రేమలో బ్రేకప్స్, ఆర్థిక ఇబ్బందులు, లైంగిక వేధింపులు, నచ్చిన వ్యక్తి మరణించడం ఇలా అనేక కారణాలతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. అయితే వీటిని అధిగ మించడం పెద్ద కష్టం కాదంటున్నారు నిపుణులు. మనకు నచ్చనివి జరిగినప్పుడు బాధ అనేది సహజం. కానీ కాస్త మైండ్ సెట్ ని మార్చుకుంటే అన్నీ ముందులాగే మామూలుగా ఉంటాయి. అలాగే మన లైఫ్ స్టైల్ లో, తీసుకునే ఆహార విషయంలో కొద్దిగా మార్పులు చేస్తే.. డిప్రెషన్ ను దూరం పెట్టవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇబ్బందిని షేర్ చేసుకోవాలి:

ఏ సమస్య వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో.. అది ఇతరుల వ్యక్తులకు షేర్ చేసుకుంటే కాస్త బాధ తగ్గుతుంది. దీంతో మనసు తేలిక అవుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఇలా చెప్పడం వల్ల మనం ముఖ్యంగా ఇబ్బంది పడకుండా ఉంటాం.

ఇవి కూడా చదవండి

మీకు నచ్చని వాటికి దూరంగా ఉండండి:

కొంత మందికి కొన్ని ఇష్టం ఉండవు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. మీకు నచ్చని వ్యక్తులైనా సరే వాళ్లకు దూరంగా ఉంటేనే బెటర్. కుదిరితే సున్నితంగా తిరస్కరించుకోవడం నేర్చుకోండి.

హెల్దీ డైట్ ప్లాన్ చేసుకోండి:

మీ ఆరోగ్యం పట్ల మీరే శ్రద్ధ తీసుకోవాలి. మీకు నచ్చే వాటినే హెల్దీగా చేసుకుని తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలను మీ డైట్ లో యాడ్ చేసుకోండి.

వ్యాయామం:

వ్యాయామం కూడా మనసును రిలాక్స్ చేస్తుంది. కాబట్టి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించండి.

హాయిగా నిద్రపోండి:

నిద్ర పోయేటప్పుడు మీకు నచ్చని వ్యక్తులు, విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. హాయిగా నిద్రపోడానికి ట్రై చేయండి. నిద్రా 22 శాతం డిప్రెషన్ ను దూరం చేస్తుందట.

ఆల్కాహాల్:

ఆల్కాహాల్ కి దూరంగా ఉండాలి. వీలైతే మానేయడం బెటర్. ఇది ఆరోగ్యంపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీంతో డ్రిపెషన్ కు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్మోకింగ్:

ధూమ పానం చేయడం వల్ల కూడా డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయట. అంతేకాకుండా స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు స్మోకింగ్ చేస్తుంటే.. వెంటనే మానేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మీకు నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపండి:

డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేస్తే.. డిప్రెషన్ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకూ యాక్టీవ్ గా ఉంటూ మీకు నచ్చిన వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.