Health Tips: సగటున మానవ శరీరంలో దాదాపు 60-70 శాతం నీరు ఉంటుంది. నీరు తాగడం వల్ల శరీరంలోని విషపూరితమైన పదార్థాలు మూత్రం, చెమట ద్వారా బయటకు వస్తాయి. ఈ విధంగా మన శరీరం అన్ని రకాల వ్యాధుల నుండి రక్షించబడుతుంది. ఈ కారణంగానే ఆరోగ్య నిపుణులు మనకు ఎక్కువ నీరు తాగమని సలహా ఇస్తుంటారు. అయితే, నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు సరిగ్గా పొందాంటే.. అవి ఎలా తాగాలి? ఏ సమయంలో తాగాలి? అనే వివరాలు తెలుసుకోవడం అత్యంత కీలకం.
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగుతుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఇలా చేయడం పెద్ద తప్పు. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే.. నిలబడి నీళ్లు తాగుతుంటారు. అది కూడా ప్రమాదకరమేనట. నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని ఎముకలు, కీళ్లపై దుష్ప్రభావం చూపుతుందట. అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కూడా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే.. ఇక నుంచి ఆ అలవాటును మనుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి నిలబడి నీళ్లు తాగడం వల్లే కలిగే అనర్థాలేంటి? నీరు ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గౌట్ ప్రమాదం..
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లపై ప్రభావం పడుతుంది. కీళ్లు బలహీనపడి మోకాళ్ల నొప్పులు వస్తాయి. క్రమంగా ఆ నొప్పి కాస్తా ఆర్థరైటిస్‌గా మారుతుంది.
మూత్రపిండాలపై ఎఫెక్ట్..
నిలబడి నీళ్లు తాగడం వల్ల నీరు నేరుగా కడుపులోకి వెళ్లిపోతుంది. ఈ కారణంగా, అందులోని విషపూరిత మూలకాలు నేరుగా మూత్రాశయంలోకి చేరుతాయి. దాంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతే కాకుండా నిలబడి నీళ్లు తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
ఊపిరితిత్తులపై ప్రభావం..
నిలబడి నీళ్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం పడుతుంది. దీని కారణంగా చాలా సార్లు ఆహారం, వాయునాళంలో ఆక్సీజన్ సరఫరా ఆగిపోతుంది. ఇది వ్యక్తుల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తుంటుంది.
నీళ్లు ఎలా తాగాలంటే..
ఆయుర్వేదం ప్రకారం.. నీటిని ఎప్పుడూ కూర్చుని కొద్ది కొద్దిగా తాగాలి. ఎప్పుడైనాసరే గ్లాసు లేదా పాత్రతో మాత్రమే తాగాలి. ప్లాస్టిక్ బాటిళ్లతో అస్సలు తాగొద్దు. గోరువెచ్చని, గది ఉష్ణోగ్రత వద్ద వేడిగా ఉన్న నీటిని మాత్రమే త్రాగాలి. ఫ్రిజ్‌లో పెట్టే నీరు కూడా హానీకరమే. భోజనానికి ముందు, భోజనం చేసిన అరగంట తర్వాత నీరు త్రాగకూడదు. తినడానికి ముందు, తిన్న తరువాత నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
Also Read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు