నెయ్యి, తేనె రెండూ మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే సూపర్ ఫుడ్స్. అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండటం వలన ఇది మన శారీరక. మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. నిజానికి బరువు తగ్గడం పరంగా రెండూ ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌లుగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు పదార్థాలను కలపడం లేదా తీసుకోవడం మానేయడం మంచిదంటున్నారు నిపుణులు. నెయ్యి, తేనె మన శరీరానికి ఎలా హానికరమో ముందుగా తెలుసుకుందాం. భారతీయ వంటలలో నెయ్యికి ప్రత్యేకత ఉంది.
శరీరంలో విషం ఏర్పడుతుంది
తేనె, నెయ్యి కలిపి తీసుకోరాదట. ఎందుకంటే అది శరీరంలో విషం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి వంటి ద్రవంతో కలిపితే, అది బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. తేనె, నెయ్యి శరీరంలోకి చేరిన తర్వాత విషంగా మారతాయి. తేనె ఒక్కటే తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి హీటింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. తేనెలో ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అనేక గుణాలు ఉన్నాయి.
తేనె, నెయ్యి కలిపి సేవిస్తే, అది శరీరంలో విషంగా మారుతుంది. ఇందులో 35-40 శాతం ఫ్రక్టోజ్, 25-35 శాతం గ్లూకోజ్, సుక్రోజ్, మాల్టోస్ పుష్కలంగా ఉంటాయి. తేనెలో కొన్ని ప్రత్యేక ఖనిజాలున్నాయి. ఇతర తీపి వస్తువులలో కనిపించనివి. ఇందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది.
పాలు, తేనె కలిపి తాగొచ్చు?
పాలలో తేనె కలిపితే అందులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే పాలలో తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు. దీని వాడకం వల్ల శ్వాసకోశ సమస్యలు, కడుపునొప్పి, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం తగ్గుతాయట. మొత్తానికి తేనె, నెయ్యి కలయిక ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వాడతారు. నెయ్యి, తేనెను సమాన పరిమాణంలో కలపడం ప్రమాదకరం. దీనివల్ల అనేక వ్యాధులు, చర్మవ్యాధులు, కురుపులు, జీర్ణకోశ వ్యాధులు, జ్వరం, పైల్స్, మూత్ర సంబంధిత రుగ్మతలు వంటి సమస్యలు వస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి